ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Spot Admissions | విద్యార్థులకు అలెర్ట్​.. తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

    Spot Admissions | విద్యార్థులకు అలెర్ట్​.. తెయూ ఇంజినీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Spot Admissions | రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్​ జిల్లాలోని తెలంగాణ విశ్వ విద్యాలయం (Telangana University)లో ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ ఇంజినీరింగ్​ కాలేజీ (Engineering College) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు.

    కాలేజీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మొదటి విడత కౌన్సెలింగ్​ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రకటన చేసింది. దీంతో కాలేజీలో సీట్లు భర్తీ కాలేదు. ఈ క్రమంలో స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, అడ్మిషన్స్ కన్వీనర్ టీజీఈఏపీసెట్​ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 26, 28, 29 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటామని, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని కాలేజీ అధికారులు సూచించారు.

    Spot Admissions | వీరు అర్హులు

    తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో స్పాట్​ అడ్మిషన్​ పొందడానికి ఈఏపీసెట్​ రాసిన అభ్యర్థులు అర్హులు. అలాగే ఇంటర్​లో ఎంపీసీ చదివిన విద్యార్థులు సైతం ప్రవేశాలు పొందవచ్చు. ఇప్పటికే ఇతర కాలేజీల్లో సీటు పొందిన వారు దీనికి అర్హులు కారు. స్పాట్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్ (EWS Reservation)​ వర్తించదు. అలాగే వీరికి ఫీజు రియింబర్స్​మెంట్ వర్తించదు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్​సైట్​ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...