ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Engineering Admissions | విద్యార్థులకు అలర్ట్​.. ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదల

    Engineering Admissions | విద్యార్థులకు అలర్ట్​.. ఇంజినీరింగ్​ కౌన్సెలింగ్​ షెడ్యూల్​ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Engineering Admissions | తెలంగాణ ఈఏపీ సెట్​ (ఇంజినీరింగ్‌) అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్​ కోర్సుల్లో(Engineering Courses) ప్రవేశాల కోసం ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్​ ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్​ను ఖరారు చేసింది. ఈ నెల 28 నుంచి మొదటి విడత ఇంజినీరింగ్‌ అడ్మిషన్స్‌ కౌన్సిలింగ్‌(Engineering Admissions Counseling) చేపట్టనున్నట్లు తెలిపింది. జూలై 6 నుంచి 10 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చు. జులై 18న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.

    రాష్ట్రంలోని ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్​ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్​(Agriculture), ఫార్మసీ ఎంట్రెన్స్(Pharmacy Entrance)​ కోసం ఏప్రిల్​ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్​ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్స్​ జరిగాయి. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్​లైన్​) విధానంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలను సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మే 11న విడుదల చేశారు. ఇంజినీరింగ్​ విభాగంలో 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్​ ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్​ విడుదల చేసింది.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....