ePaper
More
    Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ టికెట్ల విడుదల ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tirumala | తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనానికి సంబంధించి టీటీడీ(TTD) ఆన్​లైన్​లో టికెట్లు విడుదల చేస్తోంది. తాజాగా సెప్టెంబర్​ నెల కోటా(September Quota)కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

    తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. జూన్ 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

    Tirumala | 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

    Tirumala | అంగ ప్రదక్షిణం టోకెన్లు

    అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్​లైన్​ కోటాను జూన్ 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూన్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

    Tirumala | గదుల కోటా వివరాలు

    తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్​వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...