Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. ఫాస్టాగ్​ ఉంటేనే అనుమతి

Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. ఫాస్టాగ్​ ఉంటేనే అనుమతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. చాలా మంది సొంత వాహనాలు, టూరిస్ట్​ వెహికిల్స్​(Tourist Vehicles)లో స్వామి దర్శనానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఫాస్టాగ్​ లేకున్నా.. తిరుమలలోకి అనుమతిస్తున్నారు. అయితే ఇక నుంచి ఫాస్టాగ్​(FASTag​) ఉంటేనే తిరుమలలోకి ప్రవేశం కల్పిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నెల 15 నుంచి కొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఫాస్టాగ్​ విధానం అందుబాటులోకి తెచ్చింది. టోల్​ ప్లాజా(Toll Plaza)ల వద్ద వాహనదారుల సమయం వృథా అవకుండా.. వేగంగా వెళ్లడానికి ఫాస్టాగ్​లను తీసుకొచ్చింది. తాజాగా వార్షిక పాస్​లను కూడా కేంద్రం తీసుకు రానుంది. అయితే ప్రస్తుతం ఫాస్టాగ్​ లేకున్నా తిరుమల(Tirumala)లోకి వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో పలు సమయాల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు జామ్​ అవుతున్నాయి. ఫలితంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల భద్రత, రద్దీని దృష్టిలో పెట్టుకొని ఫాస్టాగ్​ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Tirumala | అలిపిరి కేంద్రం వద్ద..

తిరుమలలోని అలిపిరి తనిఖీ కేంద్రం(Alipiri Checkpoint) వద్ద ఫాస్టాగ్​లను చెక్​ చేస్తారు. ఒక వేళ వాహనాలకు ఫాస్టాగ్​ లేకపోతే తిరమలలోకి అనుమతించరు. భక్తులకు మెరుగైన భద్రత, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అయితే వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి కేంద్రం వద్ద ఫాస్టాగ్​లు జారీ చేస్తామని ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank)​ సహకారంతో వీటిని జారీ చేస్తామని.. ఫాస్టాగ్​ లేని వాహనదారులు తీసుకొని తిరుమలకు వెళ్లొచ్చని వివరించింది. ఫాస్టాగ్​ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్​ ఏర్పాటు చేశామని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమకు సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.