More
    HomeజాతీయంTirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది భక్తులు (Devotees) దర్శనం చేసుకుంటారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Darshan Tickets) విషయంలో కీలక మార్పులు చేసింది.

    Tirumala | కోటా పెంపు

    ప్రస్తుతం శ్రీవాణి దర్శన కోటా కింద నిత్యం 1500 టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీటిని రెండు వేలకు పెంచాలని నిర్ణయించింది. ఇక నుంచి కరెంట్​ బుకింగ్​ కోటా కింద తిరుమలలో రెండు వేల టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 400 టికెట్లు ఇవ్వనున్నారు. కాగా.. తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్​కు (Srivani Trust) విరాళం ఇచ్చే దాతలకు ఈ టికెట్లు ఇస్తారు. రూ.10 వేలు అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే వారికి శ్రీవాణి దర్శన టికెట్లు ఇస్తారు. ఈ టికెట్లు ఉన్న భక్తులు క్యూలైన్​లో వేచి ఉండకుండా వీఐపీ దర్శనం (VIP Darshanam) చేసుకునే అవకాశం ఉంటుంది.

    Tirumala | దర్శనం వేళల్లో మార్పు

    ప్రస్తుతం శ్రీవాణి దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు ఉదయం పూట స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఇక నుంచి సాయంత్రం కూడా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో తిరుమలలో గదులకు ఉన్న డిమాండ్​ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత విధానంతో శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులు పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉదయం టికెట్​ పొందిన భక్తులకు సాయంత్రం దర్శనం చేసేలా ఏర్పాట్లు చేశారు.

    Tirumala | కొత్త కౌంటర్ల ప్రారంభం

    భక్తుల రద్దీ మేరకు టీటీడీ తిరుమలలో సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఆయా దర్శన టికెట్ల కోసం ఆన్​లైన్​ సేవలు అందుబాటులో ఉన్నాయి. లడ్డూ ప్రసాదం కోసం కియోస్క్​ మిషన్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం ఉన్న రద్దీ నేపథ్యంలో వారం క్రితం కొత్త కౌంటర్​ను సైతం అధికారులు ప్రారంభించారు. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచి వేచి చూస్తుండడంతో.. రూ.60 లక్షల వ్యయంతో అన్నమయ్య భవనం (Annamayya Bhavan) ఎదురుగా శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్​ను ప్రారంభించారు. తాజాగా టికెట్ల కోటా పెంచడంతో పాటు దర్శన సమయాల్లో సైతం అధికారులు మార్పులు చేశారు.

    More like this

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.....

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...