అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఆన్లైన్లో (TTD Online) సైతం టికెట్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆర్జిత సేవా నవంబర్ కోటాకు సంబంధించిన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. నవంబర్ కోటా టికెట్ల కోసం ఈ నెల 18 ఉదయం 10 గంటల నుంచి డీఐపీ రిజిస్ట్రేషన్(DIP Registration) అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ నెల 18 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి.
Tirumala | బుకింగ్ అప్పుడే..
తిరుమల శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన నవంబర్ నెల(November Month) టికెట్లు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఇవే ఆన్లైన్(వర్చువల్) సేవల కోసం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్లు 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి దర్శనం, వసతి కోటా టికెట్లు 23న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు.
Tirumala | సీనియర్ సిటిజెన్ల కోటా
తిరుమల శ్రీవారిని దర్శించుకునే దివ్యాంగులు, సీనియర్ సిటిజెన్ల(Senior Citizens) నవంబర్ కోటా టికెట్లను 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. తిరుమల, తిరుపతి వసతి కోటా టికెట్లను 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
Tirumala | పద్మావతి అమ్మవారి దర్శనం కోసం
పద్మావతి అమ్మవారి ఆలయం(Padmavati Ammavari Temple), తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200) సెప్టెంబర్ టికెట్లను ఈ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ (TTD) స్థానిక దేవాలయాల సేవా కోట 26న ఉదయం 10 గంటలకు, సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కోటా టికెట్లు 26న ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.