HomeతెలంగాణRailway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway Track)​ కొట్టుకుపోయింది. దీంతో అధికారులు పలు రైళ్లను దారి మళ్లించారు. భగత్​కి కోటి ( జోధ్​పూర్ ) నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ రైలును నిజామాబాదు – పెద్దపల్లి – కాజీపేట – సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు.

ముంబయి నుంచి లింగంపల్లి మధ్య నడిచే దేవగిరి ఎక్స్​ప్రెస్ (17057 /58 )రైలును సికింద్రాబాద్ – కాజీపేట – పెద్దపల్లి – నిజామాబాదు మార్గం మీదుగా మళ్లించారు. ఓఖా –రామేశ్వరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును నిజామాబాదు – పెద్దపల్లి – కాజీపేట – కాచిగూడ మీదుగా నడపనున్నారు.

Railway Passengers | పలు రైళ్ల రద్దు

నిజామాబాదు నుంచి తిరుపతి మధ్య నడవనున్న 12794 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును బుధవారం పూర్తిగా రద్దు చేశారు. కాచిగూడ – మెదక్ ప్యాసింజర్ రైలును మీర్జాపల్లి నుంచి మెదక్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

Railway Passengers | పెద్దపల్లి బైపాస్​ మీదుగా

దారి మళ్లించిన రైళ్లన్నీ పెద్దపల్లి బైపాస్ (Peddapalli Bypass) మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లు పెద్దపల్లి జంక్షన్ వచ్చి ఇంజిన్ రివర్స్ చేసుకునే పని ఉండదు. దీంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. నెల క్రితం పెద్దపల్లి బైపాస్ మార్గాన్ని రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బైపాస్ మీదుగా గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అయితే దారి మళ్లించిన రైళ్లను కూడా బైపాస్​ మీదుగా పంపించాలని అధికారులు నిర్ణయించారు.

Must Read
Related News