ePaper
More
    HomeజాతీయంRailway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. నాందేడ్ ​– నిజామాబాద్​ – తిరుపతి వీక్లీ...

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలర్ట్​.. నాందేడ్ ​– నిజామాబాద్​ – తిరుపతి వీక్లీ ఎక్స్​ప్రెస్​ పొడిగింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | నాందేడ్​ – తిరుపతి – నాందేడ్​ మార్గంలో నడుస్తున్న వీక్లీ ఎక్స్​ప్రెస్​ రైళ్ల సేవలను పొడిగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్​ – పెద్దపల్లి మార్గంలో నాందేడ్ – తిరుపతి (07015/16) వీక్లీ ఎక్స్​ప్రెస్(Weekly Express)​ నడుస్తోంది. ఈ రైళ్లలో వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైలు సేవలను (Train Services) మరో ఏడు నెలలు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి – నాందేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్​ప్రెస్ రైళ్ల సేవలను 2026 మార్చి 28 వరకు పొడిగించినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్ర, హైదరాబాద్ (Hyderabad)​ వాసులు బాసర క్షేత్రానికి రావడానికి సైతం అనుకూలంగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారి మాత్రమే ఈ రైలు నడుపుతుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిని రెగ్యులర్​ ట్రైన్​గా (Reguler Train)​ మార్చాలని కోరుతున్నారు. లేదంటే వారానికి కనీసం మూడు సార్లయిన నడిపితే మేలంటున్నారు.

    Railway Passengers | ఆ స్టేషన్లలో ఆపాలి

    తిరుపతి – నాందేడ్​ ఎక్స్​ప్రెస్​ రైలులో ఎంతో మంది ప్రయాణం చేస్తారు. ఉమ్మడి నిజామాబాద్​, ఆదిలాబాద్​ జిల్లాల ప్రజలు ఈ రైలులో తిరుపతి వెళ్తుంటారు. అయితే ఈ రైలుకు కోరుట్ల, మెట్​పల్లి, ఆర్మూర్ రైల్వే స్టేషన్లలో హాల్ట్ సదుపాయం కల్పించాలని ప్రయాణికులు (Railway Passengers) కోరుతున్నారు. ప్రస్తుతం ఆయా స్టేషన్లలో హాల్ట్​ లేకపోవడంతో నిజామాబాద్​, బాసరకు వెళ్లి ప్రయాణికులు ట్రెయిన్​ ఎక్కుతున్నారు. ఈ రైలును వారానికి మూడు రోజులు నడిపే విధంగా నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ ధర్మపురి, కేంద్ర సహాయ మంత్రి బండి, కరీంనగర్ ఎంపీ సంజయ్ కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    PM Modi | యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా...

    Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. 18న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    Bheemgal | గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్టు

    అక్షరటుడే, భీమ్​గల్ : Bheemgal | పట్టణంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. సీఐ...

    Independence Day | ఎగిరిన మువ్వన్నెల జెండా..

    అక్షరటుడే, నెట్​వర్క్​: Independence Day | ఉమ్మడి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల...

    More like this