అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ (Hyderabad)లో మెట్రో అందుబాటులోకి వచ్చాక ఎంతో మందికి ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. చాలా మంది మెట్రో రైలును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో తన టైమింగ్స్‌లో కీలక మార్పులు చేసింది.
నగరంలో రోజురోజుకు జనాభా పెరుగోతంది. దీంతో ట్రాఫిక్ రద్దీ కూడా అధికం అవుతోంది. ఈ క్రమంలో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. మెట్రో వచ్చాక కొంత మేర సమస్య పరిష్కారం అయింది. దీంతో ప్రభుత్వం రెండో దశ మెట్రో పనులు కూడా చేపట్టింది. అంతేగాకుండా ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్లు, ఎలివేటేడ్ కారిడార్లు నిర్మిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు నవంబర్ 3 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది.
Hyderabad Metro | మార్పులు ఇవే..
ప్రస్తుతం మెట్రో రైళ్లు (Metro Trains) సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకు సేవలు అందిస్తున్నాయి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇక నుంచి అన్ని రోజుల్లో ఒకే టైమింగ్స్ ఉంటాయని మెట్రో ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని మెట్రో అధికారులు కోరారు.
