LRS | ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుదారులకు అలర్ట్​.. నేడే చివరి తేదీ

అక్షరటుడే, హైదరాబాద్: LRS : ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్​ 30)తో దరఖాస్తు ముగియనుంది. ఇకపై గడువును పెంచబోమని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. దీంతో నేటితో చివరిరోజు కావడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. లేఅవుట్లు, పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాలు, నగర, పురపాలక స్థలాలను క్రమబద్ధీకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో అవకాశం ఇచ్చింది. కానీ, స్థల యజమానులకు అప్లై చేసినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. […]

అక్షరటుడే, హైదరాబాద్: LRS : ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు గడువు నేటి (ఏప్రిల్​ 30)తో దరఖాస్తు ముగియనుంది. ఇకపై గడువును పెంచబోమని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. దీంతో నేటితో చివరిరోజు కావడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది.

లేఅవుట్లు, పంచాయతీ పరిధిలోని ఖాళీ స్థలాలు, నగర, పురపాలక స్థలాలను క్రమబద్ధీకరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో అవకాశం ఇచ్చింది. కానీ, స్థల యజమానులకు అప్లై చేసినప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

లేఅవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులకు రూ.25 వేల నుంచి రూ.లక్షల్లో ఫీజు ఉంటోంది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు యజమాని ముందుకు వస్తున్నా.. సదరు అర్జీలకు రకరకాల కొర్రీలు చూపుతుండటంతో అవస్థలు తప్పడం లేదు.

అభ్యంతరాలను పరిష్కరించుకోవడానికి కొందరు రిజిస్ట్రేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నారు. అయినా, వెబ్​సైట్​లో ఏదో ఒక కారణంతో దరఖాస్తులు ఆ అధికారులకే తిరిగి వస్తుండటంతో టౌన్​ ప్లానింగ్​ అధికారులు బేజారెత్తిపోతున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.

Adulterated Milk Deaths Rajahmundry | కల్తీపాల ఘటన.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కల్తీ పాలతో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.