అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Wine shops | జిల్లాలో మద్యం షాపులను శనివారం మూసి ఉంచాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
కమిషనరేట్ పరిధిలో కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ షాప్లు, బార్లు, క్లబ్బులు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Nimajjanam) జరుగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘా ఉంటుందని.. దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Wine shops | 6వ తేదీ ఉదయం నుంచి.
నిజామాబాద్ నగరంతో (Nizamabad City) పాటు ఆయా ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉన్నందున 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసి ఉంచాలని ఆయన పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రలను ప్రశాంతంగా జరుపుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. దీంట్లో భాగంగానే మద్యం దుకాణాలను మూసి ఉంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.