అక్షరటుడే, వెబ్‌డెస్క్: Intermediate Hall tickets | తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థుల ఎగ్జామ్ హాల్ టికెట్లను నేరుగా తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు (WhatsApp numbers) పంపించనుంది.
పరీక్షల నిర్వహణలో పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బోర్డు ఈ హాల్ టికెట్ ప్రివ్యూ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తల్లిదండ్రుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పంపుతారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హాల్ టికెట్‌లోని వివరాలను సరిచూసుకోవచ్చు.
Intermediate Hall tickets | 45 రోజుల ముందే..
2026 ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 45 రోజుల ముందే వాట్సప్‌కు హాల్‌టికెట్ లింకు పంపనుంది. దీంతో వాటిలో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే గుర్తించే వీలు కలుగుతుందని బోర్డు పేర్కొంది.
Intermediate Hall tickets | డౌన్లోడ్ ఇలా..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేందుకు తమ ఎస్సెస్సీ రోల్ నంబర్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులైతే తమ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.