అక్షరటుడే, వెబ్డెస్క్ : Traffic Diversions | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం ఫ్లై ఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రద్దీ అధికంగా ఉండే పారడైజ్ జంక్షన్ (Paradise Junction) నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
నగరంలోని NH-44లో ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట, డైరీ ఫామ్ మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. దీనికి ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పనులు ఈ నెల 30 నుంచి ప్రారంభం అవుతాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి సుమారు తొమ్మిది నెలల పాటు పలు రోడ్లు మూసివేయడంతో, ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామన్నారు.
Traffic Diversions | మూసివేయనున్న రోడ్లు
రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ (Rajiv Gandhi Statue Junction), బలమ్రాయ్ మధ్య రోడ్డు కారిడార్ పనులు సాగుతున్న సమయంలో రెండు దిశలలో మూసివేస్తారు. ప్రక్కనే ఉన్న రోడ్లు, జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు బాలమ్రాయ్, CTO జంక్షన్ మధ్య మార్గాన్ని నివారించాలని సూచించారు.
Traffic Diversions | ట్రాఫిక్ మళ్లించనున్న ప్రాంతాలు
బాలానగర్ నుంచి పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు తాడ్‌బండ్, మస్తాన్ కేఫ్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, జేబీఎస్, ఎస్బీఐ మీదుగా రాకపోకలు సాగించాయి.
సుచిత్ర నుంచి పంజాగుట్ట / ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వారు.. సేఫ్ ఎక్స్‌ప్రెస్, బాపూజీ నగర్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, ముడ్‌ఫోర్ట్, జేబీఎస్ మీదుగా ఎస్బీఐ వద్దకు చేరుకోవాలి.
తాడ్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద మళ్లిస్తారు. అన్నా నగర్, బాలమ్రాయ్ మీదుగా తాడ్బండ్కు వెళ్లాలి. అలాగే అన్నా నగర్ నివాసితులు రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ వైపు వెళ్లకుండా గమ్యస్థానాలకు చేరుకోవడానికి అంతర్గత బైలేన్‌లను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
