HomeUncategorizedTGPSC | గ్రూప్​–3 అభ్యర్థులకు అలర్ట్​.. సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ వాయిదా

TGPSC | గ్రూప్​–3 అభ్యర్థులకు అలర్ట్​.. సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ వాయిదా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: TGPSC | గ్రూప్​–3 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్​(Certificate verification postponed) ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్(Telangana Public Service Commission)​ తెలిపింది. ఇటీవల సర్టిఫికెట్​ వెరిఫికేషన్​కు టీజీపీఎస్సీ షెడ్యూల్​ విడుదల చేసిన విషయం తెలిసింది. దాని ప్రకారం జూన్​ 18 జూలై 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్​ జరగాల్సి ఉంది.

ప్రస్తుతం గ్రూప్​–2 నియామక ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో బ్యాక్​లాగ్​ పోస్టుల బాధ లేకుండా గ్రూప్​–2 పోస్టులను భర్తీ చేసిన అనంతరం గ్రూప్​–3 సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ చేపట్టాలని అభ్యర్థులు కోరారు. ఈ మేరకు టీజీపీఎస్సీ(TGPSC) తాజాగా వెరిఫికేషన్​ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా రాష్ట్రంలోని 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ(TGPSC) గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.