ePaper
More
    Homeటెక్నాలజీGmail | జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్​.. వెంటనే మీ ఖాతాలో ఈ మార్పులు చేయండి..

    Gmail | జీమెయిల్ వినియోగదారులకు అలర్ట్​.. వెంటనే మీ ఖాతాలో ఈ మార్పులు చేయండి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gmail | జీమెయిల్​ వినియోగదారులకు గూగుల్​ (Google) అలర్ట్​ జారీ చేసింది. జీమెయిల్​ ఖాతాను సురక్షితంగా (Gmail accounts secure) ఉంచుకోవడానికి పలు సూచనలు ఇచ్చింది. వినియోగదారులు తమ ఖాతాకు 2 స్టెప్​ వెరిఫికేషన్​ను ఎనబుల్​ చేయడంతో పాటు పాస్​కీలను యాడ్​ చేయాలని పలు సూచనలు చేసింది. సైబర్​ దాడులు, ఫిషింగ్​ నుంచి రక్షణ కోసం వీటిని పాటించాలని పేర్కొంది. తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలని గూగుల్ కోరింది. మరో 15 నుంచి 30 రోజుల్లో సమయం ఇచ్చింది.

    Gmail | 2-స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే..

    టూ స్టెప్​ వెరిఫికేషన్​ అనే మీ జీ మెయిల్​ ఖాతాకు (Gmail account) అదనపు భద్రతను కల్పిస్తుంది. మీరు మీ పాస్‌వర్డ్‌తో పాటు, మీ ఫోన్‌కు వచ్చే కోడ్ లేదా Google ప్రాంప్ట్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాగా.. 2–స్టెప్​ వెరిఫికేషన్​ యాక్టివేట్​ చేసుకోకపోతే తమ జీమెయిల్​ ఖాతాలకు యాక్సెస్​ కోల్పోయే అవకాశం ఉంది. కాగా.. ఇటీవల గూగుల్​, ఆపిల్​, ఫేస్​బుక్​ లాంటి ప్లాట్​ఫాంలకు సంబంధించిన 16 బిలియన్లకు పైగా పాస్​వర్డ్​లు లీక్​ అయ్యాయనే వార్తలు వచ్చాయి.

    Gmail | పాస్​కీలు ఎందుకంటే..

    పాస్‌కీలు (Passkeys) సాంప్రదాయ పాస్‌వర్డ్‌లకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇవి మీ వేలిముద్ర, ముఖ గుర్తింపు లేదా పిన్ ద్వారా మీ ఖాతాలో సురక్షితంగా లాగిన్ కావడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఇవి ఫిషింగ్​ను నుంచి ఈ ఖాతాలను కాపాడతాయి.

    Gmail | గూగుల్ ప్రాంప్ట్

    మీరు ఖాతాలో లాగిన్​ కావడానికి ఎస్​ఎంఎస్​ ఆధారిత ధ్రువీకరణకు బదులు, గూగుల్​ ప్రాంప్ట్‌ను (Google Prompt) ఉపయోగించడం మరింత సురక్షితం. మీ ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్‌ ద్వారా లాగిన్‌ని ఆమోదించమని అడుగుతుంది.

    Gmail | ఎందుకోసం అంటే..

    సైబర్ నేరగాళ్లు (Cyber criminals) ఇటీవల జీమెయిల్​ ఖాతాలను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఫిషింగ్ దాడులు, మాల్వేర్ తదితర రకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. అందువల్లనే గూగుల్​ వినియోగదారుల ఖాతాల రక్షణ కోసం పై సూచనలు చేసింది.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...