Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. జులైలో విశేష ఉత్సవాలివే..

Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. జులైలో విశేష ఉత్సవాలివే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Tirumala | కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకొని తరిస్తారు. స్వామి వారి భక్తుల కోసం టీటీడీ (TTD) ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా జులై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది.

  • జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర.
  • 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
  • 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
  • 10న గురు పౌర్ణమి గరుడసేవ.
  • 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.
  • 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
  • 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
  • 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.