ePaper
More
    Homeభక్తిTTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దర్శన వేళల్లో మార్పు

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. దర్శన వేళల్లో మార్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | వేసవి సెలవుల summer holidays నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో టీటీడీ ttd భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వీఐపీ దర్శన vip darshan ttd వేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.

    TTD | బ్రేక్​ దర్శనం సమయం తగ్గింపు

    తిరుమల tirumalaలో గతంలో గురు, శుక్రవారాల్లో ఉదయం 7.30 గంటల నుంచి బ్రేక్ దర్శనాలు vip brake darshsan ఉండేవి. మిగతా రోజుల్లో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దర్శనాలు కొనసాగేవి. దీంతో క్యూలైన్​లో ఉన్న సామాన్య భక్తులు, రూ.300 special darshan టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులు ఇబ్బంది పడేవారు. తాజాగా టీటీడీ  వీఐపీ దర్శన వేళలను మార్చింది. ఉదయం 6.20 నుంచి 8.30 వరకు వీఐపీ ప్రోటోకాల్, రిఫరల్, జనరల్ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్నవారికి దర్శనం కల్పించనున్నారు. అనంతరం సామాన్య భక్తులను అనుమతిస్తారు. ఉదయం 10.20 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీవాణి దర్శనం టికెట్లు, దాతలు, టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు దర్శనం కల్పించనున్నారు. గతంతో పోలీస్తే వీఐపీ బ్రేక్​ దర్శనం సమయాన్ని తగ్గించారు.

    TTD | ప్రయోగాత్మకంగా అమలు..

    సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయాలను టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మార్పులపై మరో రెండు, మూడు రోజులు పరిశీలించి తర్వాత అవసరం ఉంటే మార్పులు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం లభిస్తుంది. మరోవైపు వేసవిలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ సిఫార్సు లేఖలపై దర్శనాలను కూడా నిలిపివేసింది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...