అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bank Holidays | జూన్ (June) నెలలో బ్యాంకులు 21 రోజులే పనిచేయనున్నాయి. పండుగలు, సాధారణ సెలవులతో కలిపి బ్యాంకులు 9 రోజులు మూసి ఉండనున్నాయి.
ఈ నేపథ్యంలో ఖాతాదారులు సెలవుల(Holidays)ను గమనించి, తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. అయితే బ్యాంక్‌లకు సెలవులు ఉన్నా ఆన్‌లైన్(Online) సేవలు మాత్రం అన్ని రోజులలోనూ కొనసాగుతాయి.
సెలవు రోజుల్లోనూ ఏటీఎం(ATM)లు, క్యాష్ డిపాజిట్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన జాబితా ప్రకారం తెలంగాణలో బ్యాంకుల సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి.
జూన్ 1 : ఆదివారం
జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
జూన్ 7 : బక్రీద్
జూన్ 8 : ఆదివారం
జూన్ 14 : రెండో శనివారం
జూన్ 15 : ఆదివారం
జూన్ 22 : ఆదివారం
జూన్ 28 : నాలుగో శనివారం
జూన్ 29 : ఆదివారం