HomeUncategorizedVijayasai Reddy | విజ‌య‌సాయి రెడ్డికి మ‌ద్ద‌తుగా తార‌క‌ర‌త్న భార్య‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌

Vijayasai Reddy | విజ‌య‌సాయి రెడ్డికి మ‌ద్ద‌తుగా తార‌క‌ర‌త్న భార్య‌.. వైర‌ల్ అవుతున్న పోస్ట్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vijayasai Reddy | ఒక‌ప్పుడు వైసీపీలో కీల‌క నేత‌గా ఉన్న విజ‌యసాయి రెడ్డి Vijaysai Reddy ఇటీవ‌ల ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో జ‌గ‌న్ విజ‌య‌సాయిరెడ్డిపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. విజయసాయిరెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu)కు అమ్ముడుపోయారని.. టీడీపీ కూటమికి మేలు చేయడానికి తన రాజ్యసభ సీటును అమ్మేసుకున్నారని వైఎస్ జగన్(YS Jagan) సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు. మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉండదని తెలిసీ.. తన రాజీనామాతో చంద్రబాబు నాయుడు కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ, ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి చేసే స్టేట్మెంట్ల గురించి ఏం మాట్లాడతాం” అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

Vijayasai Reddy | గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసింది..

అయితే జ‌గ‌న్ కామెంట్ చేసిన కొద్ది సేప‌టికే తార‌క‌ర‌త్న భార్య అలేఖ్య(Tarakaratna wife Alekhya).. జ‌గ‌న్‌కి YS jagan కౌంట‌ర్ ఇస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టింది. విజయసాయిరెడ్డి గురించి చెబుతూ.. ఆయనకు మద్దతుగా అలేఖ్య ఈ పోస్ట్ చేశారు. ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు.. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా బలంగా ఉంటుంది.. కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ.. అది అర్హులు కాని వారి పట్ల గౌరవం. నమ్మకం, విధేయత, నీతి మీరు చెప్పినవి మాత్రమే కాదు.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చాలామంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నా.. వీటిని చూసినప్పుడల్లా నేను తరచుగా ఆశ్చర్యపోతాను.. మీరు కూడా మాట్లాడటం మొదలు పెడితే ఏం జరుగుతుందని.. ఇది నిజం’ అంటూ పోస్ట్ పెట్టారు అలేఖ్య.

ఆమె విజ‌య‌సాయి రెడ్డి(Vijayasai Reddy)కి స‌పోర్ట్‌గానే పెట్టింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలేఖ్యకు (Alekhya) విజయసాయిరెడ్డి బాబాయి వరుస అవుతారు. నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర సమయంలో నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురై బెంగళూరులో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయిన స‌మ‌యంలో అలేఖ్య‌కి బాల‌య్య‌, విజ‌యసాయి రెడ్డి అండ‌గా నిలిచారు. విజయసాయిరెడ్డి అప్పుడప్పుడు అలేఖ్యతో పాటూ పిల్లల్ని కలుస్తుంటారు.. వారితో సరదాగా గడుపుతుంటారు. అయితే విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగి వ్యవసాయ పనుల్లోకి దిగానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విజయసాయిరెడ్డికి లిక్కర్ కేసు(Liquor case)లో నోటీసులు అందగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి, తాను వైఎస్సార్‌సీపీ(YSRCP)ని వీడడంతో జ‌గ‌న్ సంచల‌న కామెంట్స్ చేశారు.

Must Read
Related News