అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | కిరాణా దుకాణాల్లో, బెల్డ్ షాపుల్లో(Belt Shops) మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మవద్దని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇష్టారీతిన వ్యాపారులు వ్యవహరిస్తున్నారు.
Nizamsagar | పిట్లం మండల కేంద్రంలో..
అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు తిమ్మానగర్(Thimmanagar) రోడ్డు పక్కన ఉన్న సాయి కూల్డ్రింక్ షాప్(Sai Cooldrink Shop)పై ఆదివారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సె వెంకట్రావు తెలిపారు.దాడుల్లో 118 మద్యం బాటిళ్లను సీజ్(118 Liquor Bottles Seized) చేసినట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే, దాబాలలో మద్యం సిట్టింగులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై వెంకట్రావు(SI Venkat Rao) హెచ్చరించారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.