ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Health tips | వీటిని తింటున్నారా.. మీ లీవర్ డ్యామేజ్ ఖాయం..!

    Health tips | వీటిని తింటున్నారా.. మీ లీవర్ డ్యామేజ్ ఖాయం..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: మన ఒంట్లో ప్రతీది ముఖ్యమైన భాగమే. ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అలాగే కాలేయానికి కూడా విశేష ప్రాధాన్యముంది. జీర్ణ సమస్యలు తలెత్తడానికి లీవర్ సరిగ్గా పని చేయకపోవడమే కారణం. గ్యాస్ట్రిక్ సమస్యలు(Gastric problems) దరి చేరకుండా ఉండాలంటే కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాలేయం దెబ్బతినడానికి ఆల్కహాల్(Alcohol) ఒక్కటే కారణం కాదు. మీరు తీసుకునే కొన్ని అధిక ఆహార పదార్థాలు కూడా కారణమే. తద్వారా ఫ్యాటీ లీవర్, సిర్రోసిస్ వైఫల్యం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇది చదివేయండి..

    Health tips | ఫ్యాటీ లీవర్​తోనే సమస్య

    ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్లు 90 శాతం ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. వీటిలో ప్రధానమైనది ఫ్యాటీ లీవర్(fatty liver). కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. అయితే, చాలా మంది మద్యపానం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని భావిస్తారు. కానీ, మద్యం తాగని వారిలోనూ ఇలాంటి సమస్యలు తరచూ వస్తున్నాయి. వాస్తవానికి.. ఫ్యాటీ లివర్ సమస్యను రెండు రకాలుగా పేర్కొంటారు. ఒకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్ఎల్డీ)(Non-alcoholic fatty liver). ఊబకాయం, మధుమేహం లాంటి సమస్యలు ఉన్ను వారిలో కనిపిస్తుంది. రెండోది.. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఏఎఫ్ఎల్డీ) (Alcoholic fatty liver). ఇది అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఆల్కహాల్​తో పాటు ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తీవ్రమవుతాయి.

    Health tips | కాలేయ వ్యాధికి కారణమయ్యే ఆహారాలివే..

    చక్కెర పానీయాలు: సోడా, ఎనర్జీ డ్రింక్స్(Energy drinks), జ్యూస్​లు ఫ్యాటీ లివర్​కు ప్రధాన కారణాలు కావచ్చు. వాటిలో అధిక మొత్తంలో చక్కెర, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. రెగ్యులర్​గా వీటిని తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య ఎదురవుతుంది.

    జంక్ ఫుడ్: ఫ్రెంచ్ ఫ్రైస్(French fries), బర్గర్లు, చిప్స్ వంటి వేయించిన పదార్థాలు కొవ్వుతో నిండి ఉంటాయి. వీటిలో అధిక స్థాయిలో ట్రాన్స్ ఫ్యాట్స్(Trans fats) ఉంటాయి. ఇవి కాలేయంలో పేరుకుపోయి కుళ్లిపోవడం ప్రారంభిస్తాయి.

    తెల్ల రొట్టె, పాస్తా: తెల్ల రొట్టె, పాస్తా ఇతర శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు(Carbohydrates) కూడా కాలేయానికి ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ ఆహార పదార్థాలలో చాలా చక్కెర ఉంటుంది. దాదాపు ఫైబర్ ఉండదు. దీని అధిక వినియోగం వల్ల, కాలేయంలో కొవ్వు వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది.

    పాల ఉత్పత్తులు: అధిక కొవ్వు ఉన్న పాలు, చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులు కూడా ఫ్యాటీ లీవర్​(fatty liver)కు కారణమవుతాయి. వీటిలో అధిక సంతృప్త కొవ్వులు ఉంటాయి.. ఇవి కాలేయాన్ని కొవ్వుగా మారుస్తాయి.

    ప్రాసెస్ చేసిన మాంసాలు: సాసేజ్, బేక్స్, హాట్ డాగ్స్(Hot dogs) వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు ఉంటాయి. ఈ పదార్థాలు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. కొవ్వు కాలేయం ప్రమాదాన్ని పెంచుతాయి.

    Health tips | జాగ్రత్తలు పాటిస్తే సరి..

    కాలేయం సరిగా పని చేయకపోతే గ్యాస్ట్రిక్ సమస్యలు(Gastric problems) వస్తాయి. ఫ్యాటీ లీవర్(fatty liver) వల్ల ఏం తిన్నా సహించదు. అయితే, కనీస జాగ్రత్తల వల్ల లీవర్ను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, పాల ఉత్పత్తులు, ఎనర్జీ డ్రింక్స్ అధిక మోతాదులో సమస్యలు తలెత్తుతాయని, వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అజీర్ణ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా లీవర్​ను సంరక్షించుకోవచ్చు.

    Latest articles

    Hyderabad | మియాపూర్​లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలోని (Hyderabad city) మియాపూర్​లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి...

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock market) లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం...

    CP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​ క్రైమ్​ కేసులు.. సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. మద్యం...

    Fake Certificates | నకిలీ పత్రాలతో ఉద్యోగాల్లో చేరిన కానిస్టేబుళ్లు.. సీసీఎస్​లో కేసు నమోదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Certificates | ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీ పడుతారు. ఏళ్లకు...

    More like this

    Hyderabad | మియాపూర్​లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలోని (Hyderabad city) మియాపూర్​లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి...

    Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic stock market) లాభాలతో కొనసాగుతున్నాయి. గురువారం...

    CP Sai Chaitanya | తాగి నడిపితే జైలుకే.. జిల్లాలో భారీగా పెరిగిన డ్రంక్​ అండ్​ క్రైమ్​ కేసులు.. సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లాలో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేశారు. మద్యం...