Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Collector |నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలి: కలెక్టర్​

Kamareddy Collector |నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలి: కలెక్టర్​

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | నులిపురుగుల నివారణకు ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వయసున్న ప్రతిఒక్కరికి అల్బెండజోల్ మాత్రలు వేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ ప(Kamareddy Municipality) రిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు (Albendazole tablets) వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది నుంచి 19 ఏళ్ల పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలన్నారు.

నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనత, ఆకలి లేమి, మానసిక, ఆరోగ్య పరంగా ఎదుగుదల వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. నులి పురుగుల నివారణ మాత్రలు తీసుకోన్నట్లయితే ఈ నెల 18న వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ ప్రభు కిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్​ విద్య, ఎంఈవో ఎల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Must Read
Related News