అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Alay Balay | హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా సాగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆయన కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. 2005లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 20 ఏళ్లుగా కొనసాగుతోంది. శుక్రవారం నిర్వహించిన అలయ్ బలయ్(Alay Balay)కు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు.
Alay Balay | ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో.
తెలంగాణ ఉద్యమ సమయంలో బండారు దత్తాత్రేయ రాజకీయ నాయకుల మధ్య ఐక్యత కోసం అలయ్ బలయ్ ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, ఆహారపు అలవాట్లను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్లుగా ఆయన నిర్వహిస్తున్నారు. ఈసారి ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) థీమ్ తో ప్రోగ్రాం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. బండారు అందరికి బంధువని అన్నారు.
Alay Balay | రాయలసీమలో నిర్వహించాలి
అలయ్ బలయ్ అంటే దత్తన్న గుర్తొస్తాడని వి హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమం ఎంతో పాపులార్ అయిందని కొనియాడారు. దసరా వచ్చిదంటే చాలు అలయ్ బలయ్ పెడతారని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందన్నారు. మనం కొట్టుకున్నా.. తిట్టుకున్నా.. అలయ్ బలయ్ చేసుకుంటామన్నారు. కానీ రాయలసీమలో కొట్టుకోవడం, చంపుకోవడం పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఫ్యాక్సనిజం తగ్గించాలంటే.. అలయ్ బలయ్ నిర్వహించాలని సూచించారు. వచ్చే అలయ్ బలయ్ రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే పార్టీలు అని తర్వాత అందరం ఒకటే అనే భావన రావాలన్నారు.
Alay Balay | మానవ సంబంధాల అల్లిక
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) మాట్లాడుతూ.. దత్తన్న మానవ సంబంధానికి అల్లిక అన్నారు. మానవత్వానికి ప్రతిక అన్నారు. ఒక పార్టీ నాయకుడు, మరో పార్టీ నాయకుడితో మాట్లాడితే నేరంగా పరిగణిస్తున్న ఈ రోజుల్లో అన్ని పార్టీల నాయకులను ఒక వేదికపైకి తీసుకు రావడం గొప్ప విషయమన్నారు.