More
    Homeబిజినెస్​Akshaya Tritiya | అక్షయ తృతీయ.. బంగారం కొనాలా.. వద్దా..?

    Akshaya Tritiya | అక్షయ తృతీయ.. బంగారం కొనాలా.. వద్దా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Akshaya Tritiya | వైశాఖ మాసం(Vaishaka masam)లో తదియ నాడు వచ్చే అక్షయ తృతీయకు alshaya tritiya ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. ఈరోజున ముహూర్తంతో సంబంధం లేకుండా ఏ పనిచేసినా శుభాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు.

    అయితే కొన్నేళ్లుగా అక్షయ తృతీయ (Akshaya tritiya) అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా బంగారం(Gold) కొనడానికే ప్రాధాన్యత పెరుగుతోంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఆభరణాల కంపెనీలు ప్రకటనలతో ఊదరగొడుతూ అక్షయ తృతీయనాడు తప్పనిసరిగా ఎంతోకొంత బంగారాన్ని కొనాలన్న భావన తీసుకువచ్చారు. అయితే బంగారం తప్పకుండా కొనాలన్నది ఏమీ లేదంటున్నారు ఆధ్యాత్మికవేత్త రుద్రమణి దేవర. ఉప్పును మహాలక్ష్మి కటాక్షం ఉన్న వస్తువుగానే భావిస్తామని, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసే శక్తి లేనివారు లవణం(Salt) కొనుగోలు చేసినా ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు. బుధవారం అక్షయ తృతీయ.. ఈ నేపథ్యంలో అసలు అక్షయ తృతీయకు, బంగారానికి సంబంధమేమిటి, ఆ రోజు ఏం చేయాలి అన్న విషయాలు తెలుసుకుందామా..

    Akshaya Tritiya | పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

    బంగారాన్ని దేవ లోహంగా పేర్కొంటారు. దీనికి హిరణ్మయి అని మరో పేరు కూడా ఉంది. అక్షయ తృతీయ రోజునే బంగారం మొదటిసారిగా గండకీ నది(Gandaki river)లోని సాలగ్రామాల గర్భంలో లభించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే కలి పురుషుడు ఐదు స్థానాలలో ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందులో బంగారం ఒకటి.

    పసిడిని అహంకారానికి హేతువుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు(Buy) చేయడమంటే.. తెలిసితెలిసి ఇంట్లోకి కలి పురుషుడిని ఆహ్వానించడమే. నిజానికి ఈ రోజున బంగారం కొనడం కాకుండా దానాలు చేయాలి. అయితే బంగారం విలువైనది కావడం, దానిని దానం చేసే స్థోమత చాలా మందికి లేకపోవడంతో దానికి బదులుగా శక్తి మేరకు ఆహారం (Food) గాని, వస్త్రాలు గాని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి.

    అక్షయ తృతీయ రోజున ‘హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదన’ అనే విష్ణు సహస్ర నామాలను పఠించడం ద్వారా శ్రీమహావిష్ణువు(Sri Maha Vishnu) అనుగ్రహం లభిస్తుంది.

    అక్షయ తృతీయ రోజునే గంగమ్మ దివినుంచి భువికి వచ్చిందని భక్తులు నమ్ముతారు. ఇది మండు వేసవిలో వచ్చే పండుగ. కావున నీళ్లను దానం చేసినా పుణ్యమే.. ఈ రోజునే ఆదిశంకరాచార్యలు కనకధారా స్తోత్రాన్ని(Kanaka dhara stotram) రచించారు. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందన్నది భక్తుల నమ్మకం.

    శ్రీకృష్ణుడు(Sri Krishna) ధర్మరాజుకు అక్షయ పాత్ర ఇచ్చింది ఈ రోజునే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్పారు.

    అక్షయ తృతీయ రోజున శివాలయంలో స్వామివారికి అభిషేకం చేసి బెల్లం పానకం దానం చేయడం ద్వారా విశేషమైన పుణ్యం లభిస్తుంది.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...