HomeసినిమాAkshay Kumar | సంక్రాంతి హిందీ రీమేక్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. హీరో మ‌రెవ‌రో...

Akshay Kumar | సంక్రాంతి హిందీ రీమేక్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. హీరో మ‌రెవ‌రో కాదు..!

Akshay Kumar | వెంకటేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం హిందీలో రీమేక్ అవుతోంది. ఈ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akshay Kumar | వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెలుగు సినీ పరిశ్రమ(Telugu Film Industry)లో భారీ విజయాన్ని సాధించింది. 2025లో ఈ చిత్రం టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో వెంకటేష్(Venkatesh) చాలా కాలం తర్వాత బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం(Director Anil Ravipudi) వహించిన ఈ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను బాగా అలరించింది.ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar) హీరోగా నటించబోతున్నారని సమాచారం.

Akshay Kumar | హిందీలో రీమేక్..

దిల్ రాజు (Dil Raju) ఈ సినిమా హక్కులను తన దగ్గరే ఉంచుకున్నారు. అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమా చూసి చాలా ఇష్టపడి, వెంటనే రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఒక ఉగ్రవాదిని పట్టుకునే ఆపరేషన్‌లో ఆయన తిరిగి రంగప్రవేశం చేయడం, అదే సమయంలో భార్య, మాజీ ప్రేమికురాలు ఒకేసారి కథలో ప్రవేశించడంతో మూవీ చాలా స‌ర‌దాగా సాగింది.. ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హిందీ రీమేక్‌లో కూడా ఇదే కథను కొంచెం మార్పులతో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్‌తో పాటు ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఈ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ కుమార్‌కు ఈ సినిమా మళ్లీ విజయాన్ని తెస్తుందా అనేది చూడాలి.

అయితే తెలుగు నేటివిటీకి ఈ క‌థ బాగానే నచ్చ‌గా, హిందీలో మాత్రం చాలా మార్పులు చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఏ కొద్దిగా తేడా వ‌చ్చిన డిజాస్ట‌ర్ టాక్ వ‌స్తుంది. అందుకే అక్క‌డి నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేయాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.