HomeUncategorizedAkshay Kumar | నా సినిమా ఎలా ఉందంటూ థియేట‌ర్స్ ద‌గ్గ‌ర మైక్ ప‌ట్టుకొని రివ్యూ...

Akshay Kumar | నా సినిమా ఎలా ఉందంటూ థియేట‌ర్స్ ద‌గ్గ‌ర మైక్ ప‌ట్టుకొని రివ్యూ అడిగిన స్టార్ హీరో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Akshay Kumar | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumr) టాలెంట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌డం ఖాయం. తాజాగా ఆయ‌న ‘హౌస్ ఫుల్ 5’ చిత్రంతో (Houseful 5 movie) ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ (Box office) వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డేనే రూ.23 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే, తన మూవీపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో అని స్వయంగా తెలుసుకోవాలనుకున్న అక్షయ్ మారు వేషంలో ఏకంగా థియేటర్ ముందు మైక్‌తో రెడీ అయిపోయారు. మాస్క్ లో ఉన్న అక్షయ్ కుమార్(Akshay kumar)ను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఒకొక్కరి దగ్గరకు వెళ్లి రివ్యూలు అడుగుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Akshay Kumar | భ‌లే ప‌ని చేశావ్‌గా..

ఆడియన్స్ (Audience) నుంచి నేరుగా మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన అక్షయ్ ఇలాంటి ప‌ని చేశారు. ముఖానికి మాస్కుతో ఆదివారం ఉదయం ముంబయిలోని ఓ థియేటర్‌కు (Theaters) వెళ్లారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను ఆపి ‘మూవీ ఎలా ఉంది?’ అంటూ ప్రశ్నించారు. వారు చెప్పిన ఆన్సర్ విని ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌య్యారు. అలా చాలాసేపు చాలా మంది ఆడియన్స్ రివ్యూ (Audience review) తీసుకుని ఎవరైనా గుర్తు పట్టే లోపే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. అక్ష‌య్ కూడా ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. కిల్లర్ మాస్కులు ధరించి బాంద్రాలోని థియేటర్‌కు చేరుకున్నాం. వాళ్లు నన్ను గుర్తు పట్టే లోపే అక్కడి నుంచి పారిపోయాం. ఇది ఒక అద్భుతమైన అనుభవం.’ అంటూ రాసుకొచ్చారు అక్షయ్.

అక్షయ్ కుమార్ (Akshy kumar) హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అక్షయ్ కుమార్ కి ఈ మ‌ధ్య స‌రైన హిట్స్ ప‌డ‌డం లేదు. సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో హౌజ్‌ఫుల్ 5 (Houseful 5) చిత్రం మాత్రం మంచి విజ‌యాన్ని అందించింది. ఈ మూవీకి తరుణ్ మన్‌సుఖాని దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, రితేశ్ దేశ్ ముఖ్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, జాకీ ష్రాఫ్, నర్గీస్ ఫక్రీ, చిత్రాంగద సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముందు పార్టులకు డిఫరెంట్‌గా ఫుల్ కామెడీ (Comedy) ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందించారు.