Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | అక్షరటుడే ఎఫెక్ట్.. కుంగిన రోడ్డుకు మరమ్మతులు

Kamareddy | అక్షరటుడే ఎఫెక్ట్.. కుంగిన రోడ్డుకు మరమ్మతులు

కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రమాదకరంగా మారిన రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. రోడ్డు కుంగిన వద్ద కంకర, సిమెంట్ వేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రమాదకరంగా మారిన రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 28 న అక్షరటుడేలో (Akshara today) ‘నిజాంసాగర్ చౌరస్తాలో (Nizamsagar Chowrastha) ప్రమాదకరంగా మూల మలుపు’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు.

కుంగిన రోడ్డును గురువారం జేసీబీతో తవ్వి, కంకర సిమెంట్ పోసి మరమ్మతులు చేపడుతున్నారు. దాంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు (traffic problems) తొలగించేందుకు రాంగ్ రూట్లో రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతో నిజాంసాగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. రాంగ్ రూట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా మున్సిపల్ నుంచి యూ టర్న్ తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో భారీ వాహనాలు వెళ్తుండటం, వర్షాలకు రోడ్డు పగుళ్లు పట్టి హనీ బేకరీ ఎదుట టర్నింగ్ పాయింట్ వద్ద రహదారి కుంగి ప్రమాదకరంగా మారింది. రోడ్డును అలాగే ఉంచితే మరింత కుంగిపోయి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ‘అక్షరటుడే’ హెచ్చరించడంతో అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.