అక్షరటుడే, వెబ్‌డెస్క్: akhil marriage date fixed : ఈ మధ్య అక్కినేని ఫ్యామిలీ ఇంట సందడి నెలకొంటుంది. గత ఏడాది నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత(Shobitha)ల వివాహం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు అఖిల్ పెళ్లికి సమయం ఆసన్నమైంది. 2025 జూలై 06వ తేదీన పెళ్లి జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
జైనాబ్ రావ్జీ(Zainab Ravji)తో అఖిల్ ఎంగేజ్ మెంట్ engagement 2024 నవంబర్ 26న జరిగింది. పెళ్లి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుందని సమాచారం. ఇప్పటికే నాగచైతన్య NAga Chaitanya, శోభితల వివాహం కూడా అందులోనే జరగడంతో వీరి వివాహం కూడా అక్కడే జరపాలని అనుకుంటున్నారట. ఈ వివాహానికి అక్కినేని బంధువులు, సన్నిహితులతో పాటుగా ఇతర సినీ ఇండస్ట్రీల నుంచి పెద్దఎత్తున అతిథులు కూడా వచ్చే అవకాశం ఉంది.
akhil marriage date fixed : మూహూర్తం ఫిక్స్..
గతంలో అఖిల్‌కి శ్రేయా భూపాల్(Shreya Bhupal)తో నిశ్చితార్థం జరగగా, అది క్యాన్సిల్ అయింది. అప్పటి నుండి సింగిల్‌గా ఉంటున్న అఖిల్.. జైనబ్ తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరికీ మునుపటి నుంచే పరిచయం ఉంది. ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారని సమాచారం. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త జి.వి. కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అఖిల్Akhilకు నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య వివాహ సమయంలోనే అఖిల్ వివాహం కూడా జరిపించాలని నాగార్జున అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆ నిశ్చితార్థం రద్దయింది.
సినీ పరిశ్రమ(film industry)లో కొనసాగుతున్నా.. అఖిల్‌కు తాత, తండ్రి నటన అబ్బలేదు. కుటుంబంతో తీసిన ‘మనం’ సినిమా తప్ప హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. హీరోగా ఐదు సినిమాలు చేసినా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.
అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఏంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని హీరో సరైన హిట్టు కోసం బాగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి (Murali Kishore Abburi) దర్శకత్వం వహిస్తున్న లెనిన్ Lenin సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.