Akhanda 2
Akhanda 2 | అఖండ 2 డిజిట‌ల్ హ‌క్కుల కోసం భారీ డిమాండ్..ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Akhanda 2 | హ్యాట్రిక్ కాంబో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) కాంబోలో ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్, అఖండ చిత్రాలతో ఈ జోడి హ్యాట్రిక్ కొట్టడంతో ‘అఖండ 2’పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ‘అఖండ’ నుంచి ఓటమి ఎరుగని బాలయ్య ఇటీవలే ‘ఢాకు మహరాజ్‌’తో మరో హిట్టు ఖాతాలో వేసుకున్నారు. ఓ హీరో, డైరెక్టర్ కలిసి హ్యాట్రిక్ హిట్లు కొట్టిన రికార్డు అసలు ఈ మధ్యకాలంలో లేదు. వీరి కలయికలో నాలుగో చిత్రంగా వస్తోన్న ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులే కాదు ఓటీటీ సంస్థలు కూడా ఎదురుచూస్తున్నాయి. బాలయ్య కెరీర్​లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్ దక్కించుకునేందుకు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ పోటీపడుతున్నాయి.

Akhanda 2 | మాములు విష‌యం కాదు..

ఎన్ని రూ.కోట్లు ఇచ్చి అయినా సరే ఓటీటీ రైట్స్ తామే తీసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం అఖండ 2 (Akhanda 2) తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులపై భారీ డీల్ సాగుతోందని సినీవర్గాల్లో చర్చలు న‌డుస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియో ఈ చిత్రం ఓటీటీ హక్కుల కోసం రూ.80 కోట్లు ఇవ్వాలని అనుకుంటుంద‌ట‌. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. 14 రీల్స్ సంస్థతో కలిసి బాలయ్య చిన్నకూతురు తేజస్విని నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్​లో అత్యంత భారీ బడ్జెట్‌తో ఏకంగా 200 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. దీంతో ముందుగానే నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తిచేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

అయితే సినిమా బడ్జెట్‌లో 40 శాతం ఓటీటీ హ‌క్కుల రూపంలో వ‌స్తుంద‌ని తెలిసి ప్ర‌తి ఒక్క‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అఖండ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌కు తోడు బాలయ్య మాస్ ఇమేజ్ వల్లే ఈ స్థాయి ఆఫర్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అఖండ (2021) సినిమాకు ఓటీటీలో మంచి స్పందన లభించిందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం పెట్టడానికి సిద్ధంగా ఉందట. అయితే ఇది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ డీల్​పై చర్చలు తుదిదశకు చేరుకున్నాయని టాలీవుడ్(Tollywood) టాక్​ నడుస్తోంది. ఒకవేళ ఇది ఖరారైతే, అఖండ 2 డిజిటల్ మార్కెట్‌లోనే కాకుండా సినిమా రైట్స్ రంగంలోనూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన‌ట్టే. కాగా.. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ఏ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చిందో మ‌నం చూశాం.