Homeజిల్లాలునిజామాబాద్​Pothangal | భక్తిశ్రద్ధలతో అఖండ హరినామ సప్తాహం

Pothangal | భక్తిశ్రద్ధలతో అఖండ హరినామ సప్తాహం

అక్షరటుడే, కోటగిరి : Pothangal | పోతంగల్​ మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి (Durga Devi Sharan Navaratri) ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బస్టాండ్ ఆవరణలో శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన దుర్గాదేవి మండపంలో అఖండ హరినామ సప్తాహం (Akhanda Harinama Saptaha) నిర్వహిస్తున్నారు.

హనుమంత్​రావు బాపురావ్​ జోషి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకడ హారతితో (Kakada Harati) కార్యక్రమాలు ప్రారంభమవుతాయని యూత్​ సభ్యులు పేర్కొన్నారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, కీర్తన భజన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ సాయంత్రం కీర్తన, రాత్రికి తెలుగు, మరాఠీ భాషల్లో భజన, జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.

Must Read
Related News