అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ మీద అభిమానుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో, రికార్డ్ లెవెల్ బుకింగ్స్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాపై మాత్రం వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. చెన్నై కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో (Telangana) మరో పెద్ద షాక్ అఖండ 2 మేకర్స్‌కు తగిలింది.
Akhanda 2 | టికెట్ ధరల పెంపును కోర్టు రద్దు చేసింది
తెలంగాణలో అఖండ 2 మూవీ టికెట్స్ హైక్స్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు కొట్టి వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధరలు పెంచుకునే అవకాశాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడంతో ఈ సినిమా టికెట్లు పెరిగిన ధరలకు విక్రయించే అవకాశం పూర్తిగా లేకుండా అయింది. ప్రభుత్వం అనుమతించిన రేట్లకు బదులుగా సాధారణ టికెట్ ధరలతోనే సినిమా విడుదల కావాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు (High Court) తాజా తీర్పు మేరకు, అఖండ 2 కోసం ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలను అధికారికంగా రద్దు చేసింది. దీంతో, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్పెషల్ షోలు నిలిపివేయబడటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్ షోల రద్దుతో పాటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అఖండ 2 డిసెంబర్ 12 నుండి సాధారణ టికెట్ ధరలతోనే (Ticket Price) విడుదల కానుంది. అధిక ధరలతో షోలు ప్లాన్ చేసిన థియేటర్స్‌కు కూడా ఈ నిర్ణయం పెద్ద షాక్‌గా మారింది.
తెలంగాణలో అఖండ 2 కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Bookings) మొదలయ్యాయి. అది కూడా పెరిగిన టికెట్ ధరల ప్రాతిపదికగా బుకింగ్స్ కాగా.. తాజాగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో గందరగోళం నెలకొంది. అధిక ధరలతో టికెట్లు కొనుకున్న ప్రేక్షకులకు డబ్బులు రిఫండ్ చేస్తారా? ఇప్పుడు సోషల్ మీడియాలో #RefundOurMoney అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “మేము ఎక్కువ డబ్బులు పెట్టి బుక్ చేసుకున్నాం… ఇప్పుడు ఏంటి?” “మా మనీ రిటర్న్ ఇస్తారా?” అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.