అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.
పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి.మాస్ యాక్షన్ సన్నివేశాలు, బాలకృష్ణ పవర్ఫుల్ ప్రెజెన్స్‌కు తోడు హిందూ ధర్మాన్ని ప్రధానాంశంగా తీసుకుని కథ సాగడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ‘అఖండ 2’కు అదనపు బలంగా మారింది.
Akhanda 2 | వసూళ్ల వర్షం..
ఈ నేపథ్యంలో తొలి రోజు వసూళ్లపై ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నివేదికల ప్రకారం, ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’ (Book MyShow)లో గంటకు సుమారు 20 వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ‘అఖండ 2’ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ. 65 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇదే ఊపు కొనసాగితే, మొదటి వారంలోనే ఈ సినిమా రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2021లో కరోనా పరిస్థితుల మధ్య విడుదలైన ‘అఖండ’ తొలి రోజే రూ. 30 కోట్ల గ్రాస్ రాబట్టగా, ఇప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో ‘అఖండ 2’ వసూళ్లు సాధిస్తుండటం విశేషంగా మారింది.
మొత్తంగా, బాలయ్య–బోయపాటి (Director Boyapati)కాంబినేషన్ మరోసారి మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాకు కొందరు సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం పట్ల నిర్మాతలు స్పందించారు. ఇండస్ట్రీలోనే కాస్త నెగిటివిటీ ఉందని రామ్ అచంట పేర్కొన్నారు. రివ్యూల విషయానికి వస్తే ఎవరి అభిప్రాయం వారు చెప్పారు. కానీ గ్రౌండ్ రిపోర్ట్ బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌తో రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం అయ్యాయి. కన్నడలోనూ రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. మూవీ రిలీజ్ (Movie Release) తర్వాత అందరం ఆనందంగా ఉన్నామని పేర్కొన్నారు.