Homeక్రీడలుAkash Deep | ఆకాశ్ దీప్ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ప‌డ్డాడా.. అక్క క్యాన్స‌ర్ బారిన...

Akash Deep | ఆకాశ్ దీప్ జీవితంలో ఇన్ని క‌ష్టాలు ప‌డ్డాడా.. అక్క క్యాన్స‌ర్ బారిన ప‌డ‌డంతో..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Akash Deep | ఇంగ్లండ్ టూర్‌లో భార‌త ఆటగాళ్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. రెండో టెస్ట్‌లో బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌల‌ర్స్ స‌మిష్టిగా రాణించ‌డంతో టీమిండియా చారిత్ర‌క విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ త‌ర్వాత యువ బౌల‌ర్ ఆకాశ్‌దీప్(Akash Deep) పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. అతను ఈ మ్యాచ్‌లో చూపిన అద్భుత ప్రదర్శనతో అంద‌రి మనసు గెలుచుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌(Edgbaston Test)లో బుమ్రా లేకపోయినా ఆ లోటును భర్తీ చేస్తూ, ఇంగ్లండ్‌పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి హీరోగా మారాడు. ముఖ్యంగా జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, బెన్ డకెట్ వంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Akash Deep | క‌సితో..

బీహార్(Bihar) నుంచి వచ్చిన ఆకాశ్‌దీప్ క్రికెట్ కెరీర్ అంత ఆశాజ‌న‌కంగా లేదు. ఆరు నెలల వ్యవధిలో తన తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. కుటుంబ బాధలు మధ్య క్రికెట్‌ను విడిచిపెట్టకుండా ముందుకు సాగాడు. బ్యాటర్ అయిన ఆకాశ్ దీప్, టీమ్‌లో చోటు దక్కించుకునేందుకు పేసర్‌గా మారాడు. ఇలా ఎన్నో త్యాగాలు, కష్టాలు అతడ్ని ఈ రోజు స్థాయికి తీసుకొచ్చాయి. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌(Test Match)లో తన అద్భుత ప్రదర్శన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆకాశ్‌దీప్‌.. తన జీవితంలోని ఒక హృదయ విదారక విషయాన్ని బయటపెట్టాడు.

ఈ విష‌యం నేను ఇప్పటివరకు ఎవ్వరితోనూ చెప్పలేదు. మా పెద్దక్క క్యాన్సర్‌తో పోరాడుతోంది. గత రెండు నెలలుగా ఆమె చికిత్స పొందుతోంది. ప్రస్తుతం పరిస్థితి కొంత బాగానే ఉంది. ఈ విజయం పూర్తిగా ఆమెకే అంకితం. నా ప్రదర్శన చూసి ఆమె ఆనందిస్తే, నా కష్టం ఫలించినట్లే అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆకాశ్‌దీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైర‌ల్ కాగా, దీనిపై నెటిజ‌న్స్ కూడా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. ఇంత బాధ ఉన్నా అలాంటి ఆటతీరు చూపించడం అంద‌రికి సాధ్యం కాదు.. అని ఒక‌రు, మ‌రొక‌రు.. నీవు ఎందరికో స్ఫూర్తి, గాడ్ బ్లెస్ యువర్ సిస్టర్ అంటూ కామెంట్లు పెట్టారు. తక్కువ సమయంలో తన ఆటతో, జీవిత గాథతో భారత అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆకాశ్‌దీప్ నిజంగా ఒక రియల్‌ ఛాంపియన్ అని కొనియాడుతున్నారు.