Homeక్రీడలుAkash deep | రాఖీ స్పెష‌ల్.. క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అక్క‌తో న్యూ ఫార్చ్యూనర్ కారు కొనుగోలు...

Akash deep | రాఖీ స్పెష‌ల్.. క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న అక్క‌తో న్యూ ఫార్చ్యూనర్ కారు కొనుగోలు చేసిన ఆకాశ్ దీప్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Akash deep | ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో (England Test Series) అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల మనసు దోచిన భారత పేసర్ ఆకాశ్‌దీప్.. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తో కూడా అద‌ర‌గొట్టాడు. ఆకాశ్ దీప్ ప్ర‌తిభ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. అయితే ఆకాశ్ దీప్ మరో ప్రత్యేక కారణంగా వార్తల్లో నిలిచాడు.

తన టెస్టు కెరీర్‌లో కీలక మైలురాయిని దాటిన వెంటనే, కొత్త టయోటా ఫార్చ్యూనర్ కారును (Toyota Fortuner car) కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకున్నాడు.తన విజయాన్ని తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న ఆకాశ్‌దీప్, ఇటీవలే టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశాడు. షోరూమ్‌లో కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోల్ని తన సోషల్ మీడియా (Social Media) అకౌంట్‌లో షేర్ చేస్తూ “కల నెరవేరింది” అని పేర్కొన్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న సోదరి అఖండ్ జ్యోతి సింగ్ మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ కారు కొనుగోలు చేశాడు.

Akash deep | క‌ల నెర‌వేరింది..

రాఖీ ముందు రోజు త‌న సోద‌రితో క‌లిసి దిగిన ఫొటోల‌ని షేర్ చేస్తూ అక్ష‌ర్ దీప్ (Akash deep) ఈ విష‌యం చెప్ప‌డం విశేషం. ఇక ఆకాశ్ దీప్‌కి తోటి క్రికెట‌ర్స్‌తో పాటు అభిమానులు, స‌న్నిహితులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఆకాశ్ కొనుగోలు చేసిన ఫార్చ్యూనర్ ప్రారంభ ధర: ₹36.05 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర: ₹52.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక ఆకాశ్‌దీప్ – కెరీర్ హైలెట్స్ చూస్తే.. ఇప్పటి వరకు భారత్ తరపున 10 టెస్టులు, మొత్తం 28 వికెట్లు, ఒకసారి ఐదు వికెట్లు, మరోసారి నాలుగు వికెట్ల‌ ప్రదర్శనతో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) అతడిని ₹8 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు తీసుకున్నాడు.

అయితే ఆకాశ్ దీప్ ఇంగ్లండ్‌తో England జ‌రిగిన గెస్ట్ సిరీస్‌లో బ్యాట్‌తో కూడా అల‌రించ‌డం విశేషం. ఐదో టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో నైట్ వాచ్‌మ‌న్‌గా వ‌చ్చి 66 ప‌రుగులు చేసి జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. జైస్వాల్‌తో క‌లిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్స్‌మెన్‌గా కెరీర్‌లో ఎదగాల‌ని అనుకున్న ఆకాశ్ దీప్ ఊహించని విధంగా బౌల‌ర్‌గా మారి స‌త్తా చాటుతున్నాడు.