అక్షరటుడే, వెబ్డెస్క్ : Ajit Pawar | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharashtra Deputy CM) అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అందులో అజిత్ పవార్ సైతం ఉన్నారు.
బారామతి విమానాశ్రయం (Baramati Airport)లో అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఉపయోగించిన విమానం బుధవారం ఉదయం కూలిపోయింది. పవార్ మంగళవారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశానికి (Cabinet Meeting) హాజరయ్యారు. పూణేలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన సమావేశాల కోసం బారామతి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరించింది. డిప్యూటీ సీఎం మృతితో మహారాష్ట్రలో విషాదం నెలకొంది. విమానం ముంబై (Mumbai) నుండి బయలుదేరిన గంట తర్వాత ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.