ePaper
More
    Homeఅంతర్జాతీయంAjit Doval | రష్యా చేరుకున్న అజిత్​ దోవల్​.. ట్రంప్​ టారిఫ్స్​ వేళ కీలక పర్యటన

    Ajit Doval | రష్యా చేరుకున్న అజిత్​ దోవల్​.. ట్రంప్​ టారిఫ్స్​ వేళ కీలక పర్యటన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ajit Doval | ఓ వైపు అమెరికా టారిఫ్​ల పేరిట బెదిరిస్తున్నా భారత్​ భయపడటం లేదు. రష్యాతో ఆయిల్​ దిగుమతుల(Russia Oil Imports)పై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. రష్యాతో రక్షణ, ఇంధన సంబంధాలను బలోపేతం చేయడంపై భారత్​ దృష్టి పెట్టింది.

    ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval)రష్యాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆయన మాస్కో చేరుకున్నారు.రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం విషయంలో భారత్​ తటస్థ వైఖరి అవలంభిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అయితే అమెరికా, నాటో దేశాలు రష్యా చర్యను తప్పు బడుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశం నుంచి నాటో దేశాలు, అమెరికా మిత్ర దేశాలు ఆయిల్​ దిగుమతులను నిలిపి వేశాయి. ఈ క్రమంలో రష్యా భారత్​కు తక్కువ ధరకు ముడి చమురు సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో ఇండియన్​ ఆయిల్​ కంపెనీలు(Indian Oil Companies) రష్యా నుంచి భారీగా క్రూడ్​ ఆయిల్(Crude Oil)​ దిగుమతి చేసుకుంటున్నాయి. అంతేగాకుండా భారత్​ ఆయుధాలను కూడా ఆ దేశం నుంచి కొనుగోలు చేస్తోంది. దీంతో ట్రంప్​ భారత్​పై 25శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. టారిఫ్స్​ మరింత పెంచుతామని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో అజిత్​ దోవల్​ రష్యాలో పర్యటించడం గమనార్హం.

    READ ALSO  Trump Tariffs | మోతెక్కించిన ట్రంప్.. 70 దేశాల‌పై సుంకాలు పెంచుతూ ఉత్త‌ర్వులు

    Ajit Doval | కీలక చర్చలు

    ప్రస్తుతం అమెరికా(America)పై భారత్​పై విధించిన సుంకాలు, అనంతర పరిణామలపై అజిత్​ దోవల్​ పర్యటనలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రంప్​ వైఖరిని రష్యా తప్పు పట్టింది. తమకు కావాల్సిన వస్తువులను ఎక్కడ కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే హక్కు భారత్​కు ఉందని రష్యా ప్రకటించింది. తాజాగా అజిత్​ దోవల్​ పర్యటనలో భాగంగా భారత్​, మరియు రష్యా మధ్య రక్షణ సహకారంపై దృష్టి పెడుతుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి పెరుగుదల గురించి కూడా చర్చించనున్నారు. భారత్​ ఇప్పటికే రష్యా నుంచి ఎస్​–400 యూనిట్లను కొనుగోలు చేసింది. పలు యూనిట్లు భారత్​కు డెలివరీ కాగా.. ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. తాజా పర్యటనలో వీటి గురించి చర్చించనున్నారు. అలాగే రష్యా Su-57 యుద్ధ విమానాలను కొనుగోలు అంశంపై పరిశీలించనున్నారు.

    READ ALSO  Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    Ajit Doval | త్వరలో విదేశాంగ శాఖ మంత్రి పర్యటన

    విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(External Affairs Minister S Jaishankar) ఆగస్టు 27, 28 తేదీలలో రష్యాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో సైతం రక్షణ, ఇంధనం, వాణిజ్య అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి జైశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో భేటీ కానున్నారు. సాంకేతిక, ఆర్థిక సహకారంపై భారతదేశం-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్‌కు సహ అధ్యక్షత వహించడానికి ఆయన రష్యా ఉప ప్రధాన మంత్రి యూరీ బోరిసోవ్‌(Russian Deputy Prime Minister Yuri Borisov)తో కూడా సమావేశం కానున్నారు.

    Latest articles

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...

    Bear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bear | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్​లో (Gandi Masanipet) ఎలుగుబండి...

    Gandhari | గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

    అక్షరటుడే, గాంధారి: Gandhari | గడ్డిమందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గాంధారి (gandhari)...

    CBI Trap | లంచం తీసుకుంటూ దొరికిన సబ్​ ఇన్​స్పెక్టర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులకు కొదవ లేకుండా పోయింది. గల్లీ నుంచి...

    More like this

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...

    Bear | గండి మాసానిపేట్ శివారులో ఎలుగుబంటి కలకలం

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bear | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసానిపేట్​లో (Gandi Masanipet) ఎలుగుబండి...

    Gandhari | గడ్డిమందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం

    అక్షరటుడే, గాంధారి: Gandhari | గడ్డిమందు తాగి ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గాంధారి (gandhari)...