HomeసినిమాAishwarya Rai | ఐశ్వ‌ర్యరాయ్ బర్త్‌డే స్పెషల్.. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోయిన మాజీ విశ్వ‌సుంద‌రి

Aishwarya Rai | ఐశ్వ‌ర్యరాయ్ బర్త్‌డే స్పెషల్.. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోయిన మాజీ విశ్వ‌సుంద‌రి

సినీ కెరీర్‌లో గ‌త 28 ఏళ‌లుగా స‌త్తా చాటుతూ ఇప్పటికీ అదే గ్రేస్, గ్లామర్‌తో మెరిసిపోతున్న ఐశ్వర్య రాయ్ నిజంగా ఎప్పటికీ ఎలెగెన్స్‌కి నిర్వచనం. ఈ రోజు బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోషల్ మీడియాలో “హ్యాపీ బర్త్‌డే ఐశ్వర్య రాయ్” అంటూ అభిమానులు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aishwarya Rai | ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా పేరొందిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈరోజు (నవంబర్ 1) తన 52వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. అందం, అభినయం, ఆత్మవిశ్వాసం.. ఈ మూడింటి సమ్మేళనం ఐశ్వర్య.

1994లో మిస్ వరల్డ్ టైటిల్ (Miss World Title) గెలుచుకున్న తర్వాత ఆమె జీవితం కీలక మలుపు తిరిగి. 1997లో వచ్చిన ‘ఔర్ ప్యార్ హో గయా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య, కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘హమ్ దిల్ దే చుకే సనం’, ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’, ‘తాళ్’, ‘గురు’ వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తమిళంలో ‘ఐ’, ‘ఎంతిరన్’, ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి చిత్రాలతో సౌత్ ప్రేక్షకుల మదిలో కూడా స్థానం సంపాదించింది.

Aishwarya Rai | అదే అందం..

52 ఏళ్ల వయసులో కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ప్రతి సారి పబ్లిక్ ఈవెంట్లలో, ఫ్యాషన్ షోలలో, బాలీవుడ్ పార్టీలలో ఐశ్వర్య కనిపిస్తే నెటిజన్లు ఆమెను “ఎప్పటికీ యంగ్ బ్యూటీ” అని పొగిడేస్తారు. సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ఐశ్వర్య (Aishwarya Rai) ఆదాయం మాత్రం తగ్గలేదు. నివేదికల ప్రకారం.. ఆమె నికర సంపద రూ. 800 కోట్లు, అంటే భర్త అభిషేక్ బచ్చన్ (రూ. 280 కోట్లు) కంటే మూడు రెట్లు ఎక్కువ! ఒక్క సినిమాకే ఆమె రూ. 10 కోట్లు వసూలు చేస్తుంది. అలాగే బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా రోజుకు 6-7 కోట్లు వరకు సంపాదిస్తుందని సమాచారం. ఇటీవల ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ దాంపత్య జీవితంపై సోషల్ మీడియాలో (Social Media) అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం నడుస్తోంది. ఐశ్వర్య ఆమె కూతురు ఆరాధ్యతో ఒంటరిగా ఉంటుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై బచ్చన్ కుటుంబం నుంచి ఎటువంటి స్పందన లేదు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకుంది. భారతదేశంలోనే అత్యంత స్టైలిష్ ఐకాన్‌లలో ఒకరిగా ఎందుకు గుర్తింపు పొందిందో ఈసారి కూడా నిరూపించింది. ఆమె డ్రెస్సులు ఎప్పుడూ అభిమానులతో ప్రశంసలు అందుకుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. డిజైనర్ మనీష్‌ మల్హోత్రా (Manish Malhotra) డిజైన్ చేసిన నేవీ బ్లూ పాంట్ సూట్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్సులో ఆమె లుక్ సింపుల్‌గా ఉండి కూడా ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. పవర్‌ఫుల్‌ లుక్‌తో పాటు క్లాసీ టచ్ కలిగిన ఈ అవుట్‌ఫిట్ పూర్తిగా “ఐశ్వర్య స్టైల్”లో ఉంది. ప్రతి చిన్న డీటెయిల్‌, ఆభరణాలు అన్నీ ఎంతో రాయల్‌గా కనిపించాయి. ఈ అవుట్‌ఫిట్‌కు సరిపోయేలా ఆమె లాంగ్ గోల్డ్ చైన్, టాసెల్ పెండెంట్ వేసుకుంది. ఇవి లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మార్చాయి. మేకప్‌, హెయిర్ స్టైల్ కూడా డ్రెస్‌కు అద్భుతంగా మ్యాచ్ అయ్యాయి. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఐష్ అందం త‌గ్గ‌లేదంటూ నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు.

Must Read
Related News