ePaper
More
    HomeసినిమాAishwarya Rai | సిందూర్‌ని హైలైట్ చేస్తూ కేన్స్‌లో మెరిసిన ఐశ్వ‌ర్య‌రాయ్.. మ‌హారాణిలా ఉన్నావంటూ కామెంట్

    Aishwarya Rai | సిందూర్‌ని హైలైట్ చేస్తూ కేన్స్‌లో మెరిసిన ఐశ్వ‌ర్య‌రాయ్.. మ‌హారాణిలా ఉన్నావంటూ కామెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Aishwarya Rai | ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫిలిం ఫెస్టివ‌ల్ కేన్స్‌(Film Festival Cannes)లో మ‌న సెల‌బ్రిటీలు భార‌తీయ ఫ్యాష‌న్ ప్ర‌త్యేక‌త‌ను చాటుతున్నారు. ఇంత‌క‌ముందు న‌టి రిచీ గుజ్జ‌ర్ రాజ‌స్తానీ చేనేత డిజైన్ ఉన్న‌ చీర‌లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఇప్పుడు ఐవ‌రీ బనారసీ చీరలో రాయల్ ఎలెగెన్స్‌ను ఎలివేట్ చేస్తూ, రెడ్ కార్పెట్‌పై సిందూర్‌ (Sindoor)ను ప్రదర్శించి అంద‌రి హృద‌యాలు దోచుకుంది ఐశ్వ‌ర్య‌రాయ్(Aishwarya Rai). ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ లుక్ ఎలా ఉంటుందో అంటూ ఇప్పటి వరకూ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆమె లుక్ బయటపడగానే ప్రజల చూపు ఆమె నీలి కళ్లవైపు పడ్డాయి. నుదుటిన సిందూరం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. బచ్చన్ కుటుంబానికి చెందిన కోడలు , ప్రముఖ నటి చీరతో పాటు సాంప్రదాయ ఆభరణాలను ధరించారు.

    Aishwarya Rai | లుక్ అదుర్స్..

    78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు Cannes Film Festival హాజ‌రైన‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సారి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంది. 2024లో అభిమానులను నిరాశపరిచింద‌నే విమ‌ర్శ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఐష్ రారాణిని త‌ల‌పించేలా సొగసైన అవతారంతో అందరినీ ఆకర్షించింది. 51 ఏళ్ల ఐశ్వ‌ర్యారాయ్ కోసం మనీష్ మల్హోత్రా చాలా శ్ర‌మించి ఈ డిజైన‌ర్ శారీని రెడీ చేసారు. ఐష్ ఈ బనారసీ చీరలో తన దేశీగాళ్ లుక్‌ని ప్రదర్శించింది. ఆస‌క్తిక‌రంగా తన సిందూర్‌ను ఐష్ ప్ర‌త్యేకంగా ప్రదర్శించింది. ఇండియా- పాక్ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సిందూర్ ఆప‌రేష‌న్(Operation Sindoor) ప్ర‌త్యేక‌త‌ను గుర్తు చేయ‌డ‌మేన‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరగ్గా, ఆ ఉగ్ర‌దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వారంతా పురుషులే. పైగా ఎక్కువ మంది హిందువులు.

    మ‌హిళ‌ల సిందూరాన్ని ఉగ్ర‌వాదాలు(Terrorists) తుడిచేసారు కాబ‌ట్టి కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్‌ క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ త‌ర్వాత పాక్ మ‌న‌పై యుద్ధం చేసింది. దానిని భార‌త్ తిప్పి కొట్టింది. అయితే ఆప‌రేష‌న్ సిందూర్ ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌పంచ‌మంతా చాటి చెప్పేందుకే ఐష్ (Aishwarya rai) సిందూర్‌ని హైలైట్ చేసింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ స్టార్ లేడీ భర్త అభిషేక్ బచ్చన్‌తో డివోర్స్ తీసుకుంటోందని రూమర్స్ వినిపించాయి. అవన్నీ అబద్దాలేనని ఈ విధంగా కూడా ఐష్ కొట్టిపారేసిన‌ట్టైంది.

    More like this

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Cheques | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Cheques | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి (Ramchandrapalli Village) చెందిన మహిళకు...