Homeటెక్నాలజీAirtel Plan | యూజర్లకు షాక్​ ఇచ్చిన ఎయిర్​టెల్​.. ఆ ప్లాన్​ నిలిపివేత

Airtel Plan | యూజర్లకు షాక్​ ఇచ్చిన ఎయిర్​టెల్​.. ఆ ప్లాన్​ నిలిపివేత

వినియోగదారులకు ఎయిర్​టెల్​ సంస్థ షాక్​ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ ప్లాన్​ రూ.189ని తొలగించింది

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Airtel Plan | తన యూజర్లకు ఎయిర్​టెల్ (Airtel) షాక్​ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న అత్యంత చౌకైన ప్లాన్​ను​ ఎత్తేసింది. ఇటీవల ప్రవేశ పెట్టిన ఈ ప్లాన్​ను తొలగించింది.

జియో (Jio) తర్వాత ఎయిర్​టెల్​కు అత్యధిక వినియోగదారులు ఉన్నారు. రూ.189 రీఛార్జ్​తో కొద్ది నెలల క్రితమే అందుబాటులోకి తెచ్చిన అన్​లిమిటెడ్​ ప్లాన్​ (Unlimited Plan)ను సంస్థ తాజాగా తొలగించింది. దీంతో ఇక నుంచి రూ.199తో కనీస రీఛార్జ్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలోనే రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ప్రవేశ పెట్టింది. డేటా తక్కువగా వినియోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉండేది. ఈ ప్లాన్​తో 21 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, 1జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు లభించేవి. అయితే ఎయిర్​టెల్​ అధికారిక వెబ్​సైట్​లో తాజాగా ఈ ప్లాన్​ కనిపించడం లేదు.

ఎయిర్​టెల్​ వినియోగదారులు (Airtel Users) ఇక నుంచి ఇంట్రీ లెవల్ ప్లాన్ కోసం రూ.199తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో 29 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2జీబీ డేటాతో పాటుగా రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. వచ్చే ఏడాది టెలికాం కంపెనీలు (Telecom Companies) రీఛార్జ్​ రేట్లను పెంచనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ – ఐడియా రేట్ల పెంపునకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ప్లాన్​ల ధరలను 10 శాతం నుంచి 20 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్​టెల్​ రూ.189 ప్లాన్​ను ఎత్తివేయడం గమనార్హం.

Must Read
Related News