అక్షరటుడే, వెబ్‌డెస్క్: Airtel perplexity | తన కస్టమర్లకు టెలీకాం సంస్థ ఎయిర్టెల్ (Telecom company Airtel) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా అందిస్తున్న ఏఐ టూల్ పర్ప్లెక్సిటీని తొలగించింది.
భారతీ ఎయిర్టెల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ ప్రయోజనాలలో ఒకటైన పర్ప్లెక్సిటీని (Perplexity) సైలెంట్‌గా తొలగించింది. కస్టమర్లు ఇకపై ఉచితంగా దీని సేవలు పొందలేరని సంస్థ ప్రకటించింది. గతంలో ఎంపిక చేసిన ప్లాన్లతో అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా ఏఐ సేవలు అందించేంది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని గతంలో ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా ఉచిత సర్వీస్‌ను తొలగించింది.
Airtel perplexity | వారికి మినహాయింపు
ఎయిర్టెల్ 2025లో తన పర్ప్లెక్సిటీ ప్రో భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. 2026 జనవరి 16 వరకు మాత్రమే ఉచిత యాక్సెస్ అందుబాటులో ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. ఇప్పుడు గడువు ముగియడంతో ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి దానిని తొలగించింది. అయితే గతంలోనే దీనిని యాక్టివేట్ చేసుకున్న వారు ఆ గడువు ముగిసే వరకు ఉచిత సేవలు పొందవచ్చు. కాగా పర్ప్లెక్సిటీ ప్రో ప్లాన్ కోసం వినియోగదారులు ఏడాదికి రూ.17,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే సేవలు పొందుతున్న వారు గడువు ముగియగానే రద్దు చేసుకోవాలని సంస్థ సూచించింది. లేదంటే ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత సబ్స్క్రిప్షన్ రద్దు చేయకపోతే ఆటోమేటిక్ పే విధానంలో భారీగా డబ్బులు కట్ అవుతాయని హెచ్చరించింది.