HomeజాతీయంDelhi Airport | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్​లో సమస్య.. విమానాల రాకపోకలు ఆలస్యం

Delhi Airport | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్​లో సమస్య.. విమానాల రాకపోకలు ఆలస్యం

ఢిల్లీ ఎయిర్​పోర్టులో ఏటీసీలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Airport | ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్​లో సాంకేతిక సమస్య తెలెత్తింది. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Indira Gandhi International Airport) పలు విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (Air Traffic Control) వ్యవస్థలో సాంకేతిక లోపంతో శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో (Delhi Airport) వందకు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, విమాన అంతరాయంపై విచారం వ్యక్తం చేస్తూ విమానాశ్రయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు తమ విమానాల సమయంపై విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. అనేక విమానయాన సంస్థలు కూడా విమానాశ్రయానికి వెళ్లే ముందు వారి విమాన స్థితిని తనిఖీ చేయాలని ప్రయాణికులను కోరాయి.

Delhi Airport | నిరీక్షిస్తున్న ప్రయాణికులు

చాలా మంది ప్రయాణికులు తమ ఫ్లైట్​ టైమ్​కు ఎయిర్​ పోర్టుకు చేరుకున్నారు. అయితే విమానాల రాకపోకల్లో ఆలస్యం కావడంతో ప్రయాణికులు గంటల కొద్ది నిరీక్షిస్తున్నారు. విమాన అంతరాయాలు, ఆన్‌బోర్డ్ విమానాలలో ఆలస్యం నిరీక్షణకు దారి తీస్తున్నట్లు ఎయిర్ ఇండియా (Air India) తెలిపింది. తమ క్యాబిన్, ఆన్-గ్రౌండ్ సిబ్బంది ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తక్షణ సహాయం అందిస్తున్నారని పేర్కొంది. ఈ ఊహించని అంతరాయంతో కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ, అనేక ఉత్తర ప్రాంతాలలో విమానాలు అంతరాయం కారణంగా ప్రభావితమయ్యాయని స్పైస్‌జెట్ తెలిపింది. ఎయిర్‌లైన్ నుంచి ఆన్‌లైన్ ట్రావెల్ అప్‌డేట్ ప్రకారం.. ప్రభావాన్ని తగ్గించడానికి, వీలైనంత త్వరగా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి విమానాశ్రయ అధికారులతో తమ సిబ్బంది పని చేస్తున్నారని వెల్లడించింది.

Must Read
Related News