ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindoor | చండీఘ‌డ్‌లో మ‌ళ్లీ మోగిన ఎయిర్ సైర‌న్.. ప్ర‌జ‌లు బాల్క‌నీలోకి కూడా రావొద్దంటూ...

    Operation Sindoor | చండీఘ‌డ్‌లో మ‌ళ్లీ మోగిన ఎయిర్ సైర‌న్.. ప్ర‌జ‌లు బాల్క‌నీలోకి కూడా రావొద్దంటూ హెచ్చ‌రిక‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Operation Sindoor | ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) త‌ర్వాత పాకిస్తాన్ భారత్ Indiaపై దాడికి ప్రయత్నిస్తోంది. గురువారం సాయంత్రం జమ్మూలో పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జమ్ము ప్రజల్లో భయాందోళనలను కలిగించాయి. పాకిస్తాన్(Pakistan) ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు చేసిన ఒక రోజు తర్వాత పేలుళ్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ప‌దే ప‌దే కాల్పుల ఉల్లంఘ‌నలకు పాల్పడుతోంది. మిసైల్స్, డ్రోన్స్ ల‌తో దాడి చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, భార‌త్ వాటిని తిప్పి కొడుతుంది. ప్ర‌స్తుతం పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.

    Operation Sindoor | మ‌ళ్లీ మోగింది..

    సరిహద్దుల్లో పాక్ సైన్యం(Pakistan Army) కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారం ఉదయం నుంచి కుప్వారా, యూరీలలో పాక్ సైనికులు తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నారు. వారికి భారత సైన్యం(Indian Army) ధీటుగా జవాబిస్తోంది. గురువారం పాక్ సైనికులు జరిపిన కాల్పులకు ఐదుగురు చిన్నారులు సహా మొత్తం పదహారు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లోని చండీగఢ్(Chandigarh) లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ Air Force అధికారులు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని మైక్ ల ద్వారా హెచ్చరించారు. డాబాపైకి, బాల్కనీలలోకి రావొద్దని సూచించారు.

    చండీఘ‌డ్ ప్రాంతంలో దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ఉద్దేశంతో సైర‌న్ వార్నింగ్(Siren Warning) ఇచ్చారు.. పాక్ నుంచి ఎటువంటి డ్రోన్లు, మిస్సైల్స్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది భార‌త సైన్యం(Indian Army). పాక్ నుంచి ఎదురయ్యే సమస్యలను గుర్తించి ముందుగానే ఎయిర్‌ రైడ్‌ సైరన్‌ మోగే విధానాన్ని భారత్ సైన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాక్ డ్రోన్లను చాలా ఈజీగా అడ్డుకునేందుకు అవకాశం ఏర్పడింది.మ‌రోవైపు భారత నావికాదళం(Indian Navy) కూడా రంగంలోకి దిగింది. పాకిస్థాన్‌ Pakistanలోని ప్రధాన నగరమైన కరాచీ పోర్టును పూర్తిగా ధ్వంసం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్(National Security Advisor Ajit Doval) తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పాకిస్తాన్‌లో దీపావళి’ అంటూ ఆయన సైటర్ వేశారు.

    More like this

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...

    Ramareddy mandal | యూరియా కోసం రైతుల బారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy mandal | రామారెడ్డి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం (society office) వద్ద యూరియా...