HomeUncategorizedPlane Crash | ఎయిరిండియా కీలక నిర్ణయం

Plane Crash | ఎయిరిండియా కీలక నిర్ణయం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఎయిర్​ ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియాకు చెందిన బోయింగ్​ 787–8 డ్రీమ్​లైనర్ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270కి పైగా మంది మరణించారు. కాగా.. మృతుల గౌరవార్థం ఎయిర్​ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానం నంబర్​ AI-171 నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. AI-171 స్థానంలో AI-159 నంబర్​ విమానం అహ్మదాబాద్-లండన్‌ మధ్య సేవలందిస్తోందని ప్రకటించింది.

విమాన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎయిర్​ ఇండియా రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే క్షతగాత్రుల వైద్య ఖర్చుల కోసం నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అంతేగాకుండా డీజీసీఏ(DGCA) ఆదేశాల మేరకు బోయింగ్​ విమానాలను తనిఖీ చేసి నివేదిక అందిస్తామని పేర్కొంది. తాజాగా ఎయిర్​ ఇండియా మృతుల గౌరవార్థం కూలిపోయిన ఫ్లైట్​ నంబర్​ను వినియోగించకూడదని నిర్ణయించింది.