Ahmedabad Plane Crash | గుజ‌రాత్ ఘోర విమాన ప్ర‌మాదం.. క్యాన్సిల్ అయిన క‌న్న‌ప్ప ఈవెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని(Meghani)లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల‌లో ఈ ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం(Aeroplane) కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది, […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని(Meghani)లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల‌లో ఈ ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. షాహీబాగ్ హోటల్ సమీపంలో విమానం(Aeroplane) కూలడంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది, ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను అంబులెన్సులలో హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Ahmedabad Plane Crash | ఘోర ప్ర‌మాదం..

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport)కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు. కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్​గా గుర్తించారు. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్​కు వెళ్తున్నట్టు సమాచారం. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Aviation Minister Rammohan Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అహ్మదాబాద్‌కి బయలుదేరారు. ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) గుజరాత్ సీఎంతో ఫోన్​లో మాట్లాడారు.

ఈ ప్రమాదం కారణంగానే కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్(Kannappa trialer Event)ను క్యాన్సిల్ చేస్తున్నామని, ట్రైలర్ రిలీజ్​ను ఒకరోజు వాయిదా వేస్తున్నామని, మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ మంచు విష్ణు (Manchu Vishnu) తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఈ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...