Air India | ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
Air India | ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | భారత్​ – పాకిస్తాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్​ ఇండియా Air India కీలక ప్రకటన చేసింది. దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పంజాబ్​, జమ్మూకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​ లోని పలు విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. ఎయిర్​పోర్టులే airports లక్ష్యంగా పాక్​ దాడులు చేస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో ఎయిర్​ ఇండియా సైతం సరిహద్దు ప్రాంతాలకు విమానాలు నడపొద్దని నిర్ణయించింది. అధికారిక ప్రకటన తర్వాత జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్​సర్, భుజ్, జామ్ నగర్, రాజ్ కోట్ నగరాలకు సర్వీసులు రద్దు చేసింది. ఈనెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.