HomeUncategorizedAir India | ఏడు విమానాలు రద్దు చేసిన ఎయిర్​ ఇండియా

Air India | ఏడు విమానాలు రద్దు చేసిన ఎయిర్​ ఇండియా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) తర్వాత ఎయిర్​ ఇండియా (Air India) అప్రమత్తమైంది. తన విమానాలను తనిఖీ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మెయింటెన్స్, ఆపరేషన్స్​ కారణాలతో ఏడు విమానాలను ఎయిర్​ ఇండియా రద్దు చేసింది. ఇందులో నాలుగు అంతర్జాతీయ (International) సర్వీసులు, మూడు డొమెస్టిక్​ (Domestic) ఫ్లైట్​లు ఉన్నాయి.

అహ్మదాబాద్​లో జూన్​ 12న ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270కి పైగా మృతి చెందారు. దీంతో ఎయిర్​ ఇండియా తన విమానాల్లో విస్తృత తనఖీలు చేపడుతోంది. డీజీసీఏ ఆదేశాల మేరకు బోయింగ్​ విమానాలను తనిఖీ చేసి నివేదిక సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మెయింటెన్స్​ కారణాలతో శుక్రవారం విమానాలను రద్దు చేసింది. ఇటీవల పలు విమానాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Air India | రద్దయిన విమానాల వివరాలు..

  • AI906: దుబాయ్ నుంచి చెన్నై
  • AI308: ఢిల్లీ నుంచి మెల్‌బోర్న్
  • AI309: మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీ
  • AI2204: దుబాయ్ నుంచి హైదరాబాద్
  • AI874: పూణే నుంచి ఢిల్లీ
  • AI456: అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ
  • AI2872: హైదరాబాద్ నుంచి ముంబై

Air India | ప్రయాణికుల అసహనం

ఇటీవల తరచూ విమానాలు రద్దవుతుండడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం ఘటన జరిగిన తర్వాత పలు ఎయిర్​ ఇండియా విమానాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఏడు విమానాలను సంస్థ రద్దు చేసింది. మరోవైపు బాంబు బెదిరింపు కాల్స్​తో విమానాలు అత్యవసర ల్యాండింగ్​ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ సమయం అంతా ఎయిర్​పోర్టులోనే పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సడెన్​గా ఫ్లైట్లు రద్దు చేస్తే తమ ప్రయాణాలు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.

కాగా.. విమాన ప్రమాదం ఘటన తర్వాత 66 డ్రీమ్‌లైనర్ (Dreamliner) విమానాలు రద్దు అయ్యాయి. జూన్ 12న మాత్రమే డ్రీమ్‌లైనర్ నడిపే 50 విమానాలలో ఆరు నిలిచిపోయాయి. జూన్ 18 నాటికి ఎయిర్ ఇండియా 33 డ్రీమ్‌లైనర్‌లలో 24 విమానాలను తనిఖీ చేశారు.