అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air Force rescue | తుఫానులో చిక్కుకున్న ఇండిగో విమానం 6E 214ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (Indian Air Force) రక్షించింది. తుఫానులో చిక్కుకున్న విమానం పాకిస్తాన్ (pakistan) గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి కోరగా, ఆ దేశం నిరాకరించిందని భారత వైమానిక దళం శుక్రవారం ధ్రువీకరించింది. గత బుధవారం ఢిల్లీ (Delhi) నుంచి శ్రీనగర్‌కు (Srinagar) బయల్దేరిన ఇండిగో విమానం తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తుఫానులో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరింది, కానీ ఆ అభ్యర్థనను పాక్ తిరస్కరించింది. పఠాన్‌కోట్(Pathankot) సమీపంలో తుఫాను, వడగళ్ల వాన కారణంగా విమానం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్పందించి ఆ విమానాన్ని రక్షించింది. నియంత్రణ వెక్టర్లు. గ్రౌండ్‌స్పీడ్ రీడౌట్‌లను ఇవ్వడం ద్వారా శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానాన్ని (IndiGo flight) సురక్షితంగా ల్యాండ్ చేయడానికి సహాయం చేసినట్లు ఐఏఎఫ్ తాజాగా ధ్రువీకరించింది.
Air Force rescue | గగనతల నిషేధం పొడిగింపు..
తన గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని భారతీయ విమానాలపై నిషేధాన్ని జూన్ 24 వరకు పాకిస్తాన్ (Pakistan) తాజాగా పొడిగించింది. “భారతదేశం (India) ద్వారా నమోదు చేయబడిన, నిర్వహించబడుతున్న, యాజమాన్యంలోని లేదా లీజుకు తీసుకున్న అన్ని విమానాలకు” వర్తిస్తుంది. భారత సైనిక విమానాలకు (Indian military aircraft) కూడా వర్తిస్తుందని పాక్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, భారత్ కూడా పాకిస్తాన్ విమానాలకు (Pakistani aircraft) గగనతల నిషేధాన్ని పొడిగించింది.