అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air Ambulance | ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ Kedarnathలో శనివారం ఎయిమ్స్ రిషికేశ్ rishikesh AIIMS హెలి అంబులెన్స్ సర్వీస్‌కు చెందిన హెలికాప్టర్ helicopter కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ వెనుక భాగంలో దెబ్బతినగా, పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. విమానంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు పైలట్(కెప్టెన్), డాక్టర్‌తో పాటు మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఎత్తయిన కొండపైకి వెళ్తున్న క్రమంలో సాంకేతిక సమస్యలు technical problems తలెత్తాయి. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ emergency landing చేస్తుండగా, హెలికాప్టర్ వెనుకు భాగం దెబ్బ తిని కుప్పకూలింది. గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పైలట్, ఆన్‌బోర్డ్ సిబ్బంది తక్షణ ప్రతిస్పందన ప్రాణనష్టాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు.
కేదార్‌నాథ్‌లో ఒక రోగి కోసం హెలి-అంబులెన్స్ air ambulance వెళ్లిందని ఎయిమ్స్ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సందీప్ కుమార్ సింగ్ తెలిపారు. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా, హెలికాప్టర్ దెబ్బతిందన్నారు. మరోవైపు, హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. కాగా.. ఈ నెల ప్రారంభంలో మే 8న ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి uttara kashi జిల్లాలో ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. ఏడు సీట్ల చాపర్ గంగోత్రి gangotri సమీపంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.