HomeతెలంగాణFarmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

Farmers | రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం.. ఇందూరు కేంద్రంగా మరో రెండు సంస్థలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Farmers | కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్​ జిల్లా (Nizamabad District) రైతులకు శుభావార్త చెప్పింది. రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా మరో రెండు సంస్థలను ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం (National Turmeric Board office) ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయ భవనాన్ని ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పసుపు ఎగుమతులను ప్రోత్సహించడానికి జాతీయ సహకార ఎగుమతి లిమిటెడ్ (NCEL), జాతీయ సహకార ఆర్గానిక్స్ లిమిటెడ్‌లను(NCOL) నిజామాబాద్​లో ఏర్పాటు చేస్తామన్నారు.

పసుపు రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంలో భాగంగా నిజామాబాద్‌లో (Nizamabad) ఈ సంస్థలను స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహకార సంస్థలు పసుపు ఎగుమతులను పెంపొందించడంలో, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. రైతులకు న్యాయమైన లాభాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.