అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC Sanitation Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Greater Hyderabad Municipal Corporation) 300 వార్డులలో మెగా శానిటేషన్ డ్రైవ్‌ను చేపట్టనుంది. పరిశుభ్రమైన, పచ్చని హైదరాబాద్ (clean and green Hyderabad) దిశగా చర్యలు చేపట్టింది.
జీహెచ్ఎంసీ (GHMC) డిసెంబర్ 29 జనవరి 31 వరకు నగరంలోని మొత్తం 300 వార్డులను కవర్ చేస్తూ తన అతిపెద్ద స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. పాత వ్యర్థాలు, చెత్తా చెదారం తొలగింపు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, రోడ్లు, డివైడర్లు & మీడియన్లను శుభ్రపరచడం చేయనున్నారు. సరస్సులు, నాలాలు, పార్కులు, ఫుట్ పాత్లను క్లీన్ చేస్తారు. C&D వ్యర్థాల తొలగింపు, గ్రీన్ వేస్ట్ మేనేజ్మెంట్, GVPలను అందమైన సెల్ఫీ పాయింట్లుగా మార్చనున్నారు.
GHMC Sanitation Drive | అవగాహన కార్యక్రమాలు
శానిటేషన్ డ్రైవ్‌లో భాగంగా నగర ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan) తెలిపారు. పిల్లలు, యువతతో పరిశుభ్రత ప్రతిజ్ఞలు చేయిస్తామన్నారు. ఈ-వేస్ట్, పునర్వినియోగ వస్తువులను సేకరించనున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, మూత్ర విసర్జన, అక్రమ డంపింగ్ చేసే వారికి జరిమానాలు విధించనున్నారు. క్లెయిమ్ చేయని స్క్రాప్ వాహనాల తొలగిస్తారు. శిథిలావస్థలో ఉన్న పబ్లిక్ టాయిలెట్ల పునరుద్ధరించనున్నారు. డ్రైవ్ సందర్భంగా రోజువారీ వార్డు వారీగా నివేదికలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో త్వరలో అక్కడ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు తెలుస్తోంది.